AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!

అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!

Phani CH
|

Updated on: Jul 07, 2026 | 6:14 PM

Share

మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లా ఖోపోలీ సమీపంలోని జెనిత్ జలపాతం వద్ద ఆకస్మికంగా వరద ఉధృతి పెరగడంతో 100 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానిక గ్రామస్థులు తాళ్ల సహాయంతో సాహసోపేతంగా అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వర్షాకాలంలో జలపాతాల వద్ద అధికారులు జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

భారీ వర్షాలు కురుస్తున్నాయని, జలపాతాల వద్ద నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉందంటూ అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. కేవలం సెల్ఫీలు, వీడియోల సరదా కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జలపాతాలవద్దకు వెళ్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఇలాంటి నిర్లక్ష్యమే వంద మందికి పైగా పర్యాటకుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఖోపోలీ ప్రాంతంలోని ప్రసిద్ధ ‘జెనిత్ జలపాతాన్ని’ సందర్శించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అప్పటికే జలపాతంలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అయినా ప్రమాదాన్ని ఏమాత్రం ఊహించని పర్యాటకులు లోపలికి వెళ్లారు. చూస్తుండగానే అకస్మాత్తుగా వరద ఉధృతి భారీగా పెరగడంతో, బయటకు వచ్చే దారి లేక 100 మందికి పైగా పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న సమీప గ్రామానికి చెందిన స్థానికులు తక్షణమే రంగంలోకి దిగారు. తాళ్ల సహాయంతో, తమ ప్రాణాలను పణంగా పెట్టి వరదలో చిక్కుకున్న పర్యాటకులందరినీ ఒక్కొక్కరిగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గ్రామస్థులు సమయస్ఫూర్తితో స్పందించకపోతే ఈ ఘటన పెద్ద విషాదంగా మారేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా పర్యాటకులు ప్రకృతి విపత్తుల సమయంలో అధికారులు ఇచ్చే హెచ్చరికలను పాటించాలని, క్షణకాలం సరదా కోసం జీవితాలను పణంగా పెట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!

వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి

గుడ్‌న్యూస్‌.. గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

Maa Inti Bangaram: ఉత్తర అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు!

నీ ‘సర్‌’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా

Follow Us