Breaking News
  • కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో శానిటైజర్‌, మాస్క్‌లు ఉపయోగించాలని తెలిపారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. అలాగే పోలీసు వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయాలని ఆదేశించారు.
  • విశాఖలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15కు చేరింది. అక్కయ్యపాలెం, తాటిచెట్ల పాలెం, ఐటీ జంక్షన్‌ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇటు ఇంటింటి సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. 261 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కు చేరింది. ఇందులో 140 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్టు అయిన వారివే! పాజిటివ్‌ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో నమోదయ్యాయి.
  • కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలో తెలుగువారికీ ఇబ్బందులు తప్పడంలేదేు. చాలా మంది ఇళ్ల నుంచే పని చేసుకుంటున్నారు. పిల్లలకు ఆన్ లైన్ లోనే తరగతులు, పరీక్షలు జరుగుతున్నాయి. బయట మార్కెట్లు మూత పడిన నేపథ్యంలో ఉన్న సరుకులతోనే సర్ధుకుంటున్నారు.
  • కరోనా బారిన పడి మరణించిన వారిలో 95 శాతం వృద్ధులే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. వీరిలో సగం మంది 80 ఏళ్ల వయసు దాటినవారేనని తెలిపింది. అందులో కూడా హృద్రోగం, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని గుర్తించింది. 50 ఏళ్లలోపు కొవిడ్ 19 వైరస్ బాధితుల్లో ఒక మోస్తారుగా వ్యాధి లక్షణాలు అధికంగా ఉన్నట్లు కూడా నిర్ధారించారు.

అరబిందో ఫార్మాకు కొత్త తలనొప్పులు.. లోపాలను గుర్తించిన యూఎస్ ఎఫ్‌డీఏ

US FDA observations on telangana plant fresh headache for aurobindo pharma, అరబిందో ఫార్మాకు కొత్త తలనొప్పులు.. లోపాలను గుర్తించిన యూఎస్ ఎఫ్‌డీఏ

ప్రముఖ ఔషదరంగ సంస్ధ అరబిందో ఫార్మా హైదరాబాద్ ‌బ్రాంచీకి కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. ఈ యూనిట్‌ను తనిఖీ చేసిన అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఐ) ఏడు లోపాలను గుర్తించి భారీ షాక్ ఇచ్చింది. దీంతో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని గ్లెన్‌మార్క్ ఫార్మాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు ఎగుమతి చేసే జనరిక్ కంపెనీల్లో అయిదో పెద్ద కంపెనీ అరబిందో ఫార్మా. దీని మెయిన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. దీనికి అమెరికా నుంచి 25 నుంచి 30 శాతం ఆదాయం వస్తుంది. అయితే యూఎస్ఎఫ్‌డీఏ షాక్ నేపథ్యంలో సోమవారం అరబిందో కంపెనీ షేర్లు ఐదేళ్ల కనిష్టానికి నష్టపోయాయి. దీనికి ప్రధాన కారణం గత నెలలో యూఎస్ఎఫ్‌డీఏ తనిఖీ చేసి ఏడు లోపాలను గుర్తించడమేనని బాంబే స్టాక్ ఎక్చేంజ్‌కు అరబిందో ఫార్మా తెలియజేసింది.

గత నెల సెప్టెంబర్‌ 19 వ తేదీ నుంచి 27 మధ్య యూఎస్ ఎఫ్‌డీఏ అధికారులు అరబిందో ఫార్మాలో తనిఖీలు నిర్వహించారు. దీనిలో ఏడు లోపాలను గుర్తించారు. వీటిలో ప్రధానంగా కంపెనీ తయారు చేసే ఔషధ ఉత్పత్తులకు సంబంధించినవే ఉన్నాయని తెలుస్తుంది. అయితే తమ కంపెనీపై వచ్చిన లోపాలను గుర్తించి వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని కంపెనీ అధికారులు తెలిపారు. సరిదిద్దిన తర్వాత మరోసారి యూఎస్ఎఫ్‌డీఏకు నివేదిక కూడా పంపిస్తామని అరబిందో ఫార్మా అధికారులు వెల్లడించారు.

సోమవారం జరిగిన ట్రేడింగ్‌లో అరబిందో ఫార్మా షేర్లు కంపెనీ షేర్లు 20శాతం నష్టపోయి రూ.458.50 వద్ద క్లోజ్ అయ్యాయి. దీంతో ఐదేళ్ల కనిష్టానికి చేరుకున్నట్టయ్యింది. ఈ పరిస్థితితో అరబిందో కంపెనీకి కొత్త చిక్కులు వచ్చినట్టయింది. ఎందుకంటే ప్రధానంగా అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల ద్వారా అరబిందో ఫార్మాకు 25 నుంచి 30 శాతం ఆదాయం లభిస్తుంది. ఒక్కసారి స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడంతో కంపెనీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది.

Related Tags