Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైం చూసి కొట్టే ప్లాన్‌లో బీజేపీ.. ఇక రంగంలో ఆమె వస్తారా?

తెలంగాణ బీజేపీకి ఫుల్స్ మీల్స్ దొరికినట్టయ్యింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రారంభించింది. అందివచ్చిన అవకాశాలను అస్సలు వదులుకోవడం లేదు. పైగా రాష్ట్ర గవర్నర్ స్వయంగా తమ పార్టీకి చెందిన నేత కావడంతో అధికార పార్టీని ఇరుకున పెట్టడం మరింత సులభమని భావిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె ఆరో రోజుకు చేరింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం […]

టైం చూసి కొట్టే ప్లాన్‌లో  బీజేపీ.. ఇక రంగంలో ఆమె వస్తారా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 11, 2019 | 11:32 AM

తెలంగాణ బీజేపీకి ఫుల్స్ మీల్స్ దొరికినట్టయ్యింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రారంభించింది. అందివచ్చిన అవకాశాలను అస్సలు వదులుకోవడం లేదు. పైగా రాష్ట్ర గవర్నర్ స్వయంగా తమ పార్టీకి చెందిన నేత కావడంతో అధికార పార్టీని ఇరుకున పెట్టడం మరింత సులభమని భావిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె ఆరో రోజుకు చేరింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సమ్మెను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆర్టీసీ అభివృద్ది పేరుతో మూడు రకాల వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెపై తన వైఖరిని ముఖ్యమంత్రి వెల్లడించారు. మరోవైపు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు వైద్యాన్ని కూడా నిలిపివేయడంతో పరిణామాలు తీవ్రంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడిపెంచేందుకు విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. సమ్మె రాజ్యాంగ బద్ధంగానే చేస్తున్నామని, ఏ ఒక్క ఉద్యోగి తమ ఉద్యోగం కోల్పోయే పరిస్థితి లేదని కార్మికులకు విపక్షాలు భరోసా ఇస్తున్నాయి.

ఇదిలా ఉంటే తెలంగాణలో ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న సమ్మెకు బీజేపీ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీని ఆధారంగా సీఎం కేసీఆర్‌పై వ్యూహాత్మకంగా దాడికి దిగాలని బీజేపీ రెడీ అవుతోంది. రాష్ట్రంలో ప్రజలు ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని గవర్నర్‌కు తెలియజేయాని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు కొత్త గవర్నర్ తమిళసై మాత్రం ఆర్టీసీ సమ్మెపై స్పందించలేదు. ఒకవేళ అటు ప్రజలు, ఇటు ఆర్టీసీ కార్మికుల సమస్యపై ఆమె స్పందించి మాట్లాడితే రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో తొలి సమస్యగా నిలిచిపోనుంది.

తెలంగాణలో చాపకింద నీరుగా వ్యాపిస్తున్న బీజేపీ ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో అన్నిపార్టీలకు షాక్ కొట్టేలా నాలుగు ఎంపీ స్ధానాలను సైతం గెలుచుకుంది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిస్ధాయిలో బలం పెంచుకుని టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారాలని ప్రయత్నిస్తుంది. వీటన్నిటినీ బేరీజు వేసుకునే కొత్త గవర్నర్‌గా స్ట్రాంగ్ లేడీని నియమించింది కేంద్రం.

రాష్ట్ర కొత్త గవర్నర్ తమిళసై.. ఇక నుంచి తన మార్కును చూపాలని రాష్ట్ర బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ దూకుడుకు కళ్లెం వేసేలా ఆమె చర్యలు తీసకుంటే బాగుంటుందని కూడా రాష్ట్ర నేతలు బలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనుకోని ఉపద్రవంలా వచ్చిన ఆర్టీసీ సమ్మెను క్యాష్ చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తెలగాణ వ్యాప్తంగా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో.. గవర్నర్‌తో భేటీ అయ్యి ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరును తెలియజేసేందుకు సైతం రెడీ అవుతున్నారు. అయితే గవర్నర్‌ తమిళసైతో భేటీ వెనుక బీజేపీ పావులు కదిపే ఛాన్స్ ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఆర్టీసీ సమ్మె విషయంలో గవర్నర్ కార్మికులవైపు సానుకూలంగా ముందుకు వెళితే ఇక అధికార టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను బీజేపీ ఇరుకున పెట్టడంలో సక్సెస్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఫీచర్ ఉంటే అన్ని భాషలూ వచ్చినట్టే.. వాట్సాప్ యూజర్లకు పండగే..!
ఈ ఫీచర్ ఉంటే అన్ని భాషలూ వచ్చినట్టే.. వాట్సాప్ యూజర్లకు పండగే..!
ఈ సొగసరి సోయగాన్ని చూస్తే హంస చిన్నబోతుంది.. గార్జియస్ ఈషా..
ఈ సొగసరి సోయగాన్ని చూస్తే హంస చిన్నబోతుంది.. గార్జియస్ ఈషా..
అక్కడ అల్లుళ్లకు కట్నంగా పాములు.. వాటితో ఏంచేస్తారంటే?
అక్కడ అల్లుళ్లకు కట్నంగా పాములు.. వాటితో ఏంచేస్తారంటే?
వైద్య చరిత్రలోనే అద్భుత ఘట్టం.. ఒకే శిశువు రెండుసార్లు పుట్టింది.
వైద్య చరిత్రలోనే అద్భుత ఘట్టం.. ఒకే శిశువు రెండుసార్లు పుట్టింది.
భక్తుల పాలిట శాపంగా మారుతున్న కోతుల అవస్థలు!
భక్తుల పాలిట శాపంగా మారుతున్న కోతుల అవస్థలు!
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
Viral Video: టేకాఫ్‌ సమయంలో విమానంలో మంటలు...
Viral Video: టేకాఫ్‌ సమయంలో విమానంలో మంటలు...
స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం..
స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం..
అంతరిక్షమే హద్దుగా.. ఐఎస్ఎస్‌కు వెళ్లనున్న భారత వ్యోమగామి
అంతరిక్షమే హద్దుగా.. ఐఎస్ఎస్‌కు వెళ్లనున్న భారత వ్యోమగామి
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో