Viral Video: పాపం ఆకలి తీరుద్దామని వెళ్లి.. మొసలికే ఆహారం అయ్యాడు.. ఇదిగో వీడియో!
మొసలికి ఆహారం పెట్టేందుకు వెళ్లిన ఓ కేర్ టేకర్‌కు ఊహించని ప్రమాదం ఎదరైంది. పార్క్‌లోని నీటి కుంటలో ఉన్న మొసలికి కేర్ టేకర్ చికెన్ పెడుతుండగా.. అది ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. చికెన్‌తో పాటు అతని చేతుని పట్టుకొని నీటికి లాగేసింది. అక్కడే ఉన్న కొందరు సిబ్బంది అతన్ని కాపాడి హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కేర్ టేకర్ మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

మొసలికి ఆహారం పెట్టేందుకు వెళ్లిన కేర్ టేకర్ దానికే ఆహారంగా మారిన ఘటన పపువా న్యూగినియా రాజధాని పోర్ట్ మోర్స్‌బీలోని అడ్వెంచర్ పార్క్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పార్క్‌లో కేర్ కేటర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి శనివారం సాయంత్రం ఓ మొసలికి ఆహారం పెట్టడానికి వెళ్లాడు.. దానికి ఆహారం అందిస్తున్న క్రమంలో ఆ మొసలి ఒక్కసారిగా కేర్‌టేకర్‌ను చేతిని పట్టుకొని నీటిలోకి లాగేసింది. అయితే దాని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్ని్స్తూ ఆ కేర్ టేకర్ గట్టికా కేకలు వేశారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడే ఉన్న కొంతమంది పార్క్ సిబ్బంది అక్కడికి చేరుకొని కేర్ టేకర్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఆ ముసలి అప్పటికే కేర్ టేకర్‌ను నడుము వరకు నోట్లోకి లాగేసుకుంది. ఇక చేసేదేమి లేక ఆ సిబ్బంది మొసలిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ మొసలి అక్కడేప్రాణాలు కోల్పోయింది. కానీ అప్పటికే ఆ ముసలి సదురు కేర్ టేకర్ ఓ కాలిని తినేసింది. ఇక వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆ కేర్ టేకర్ కూడా మరణించాడు.
అయితే ముసలి కేర్ టేకర్‌పై దాడి చేస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లతో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంటర్నెట్‌లో ఈ వీడియో చూసిన జనాలు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
Papua New Guinea 🇵🇬:A Crocodile 🐊keeper at the Adventure Park in Port Moresby, 14 Mile, was attacked by his own crocodile.Police 👮shot the crocodile dead and saved the man, although both of his legs were bitten off by the crocodile. pic.twitter.com/arYA3MnJfl
— marknehpets (@mapkpets) September 5, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
