పొట్టకూటికోసం తప్పని తిప్పలు..పసిబిడ్డతో ఓ నాన్న చేసిన సాహసం..! వారిని కదిలించింది..

|

Sep 05, 2024 | 1:55 PM

ఇది చదివితే ఎవరైనా సరే భావోద్వేగానికి గురవుతారు. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లోని స్టార్‌బక్స్ స్టోర్ మేనేజర్ దేవేంద్ర మెహ్రా దీన్ని లింక్డ్‌ఇన్‌లో ఈ అతని కథను షేర్‌ చేశారు. అందులో ఔట్‌లెట్ నుండి ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన జొమాటో డెలివరీ బాయ్ ఫోటో ఉంది. కానీ, ఆ వ్యక్తి తన..

పొట్టకూటికోసం తప్పని తిప్పలు..పసిబిడ్డతో ఓ నాన్న చేసిన సాహసం..! వారిని కదిలించింది..
Zomato Agent
Follow us on

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు మనుగడ కోసం చాలా కష్టపడుతున్నారు. అలాంటి వారి గురించి తెలుసుకున్న తర్వాత మన సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇటీవల, అటువంటి వ్యక్తి కథ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చదివితే ఎవరైనా భావోద్వేగానికి గురవుతారు. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లోని స్టార్‌బక్స్ స్టోర్ మేనేజర్ దేవేంద్ర మెహ్రా దీన్ని లింక్డ్‌ఇన్‌లో ఈ అతని కథను షేర్‌ చేశారు. అందులో ఔట్‌లెట్ నుండి ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన జొమాటో డెలివరీ బాయ్ ఫోటో ఉంది. కానీ, ఆ వ్యక్తి తన ఒడిలో ఒక చిన్నపాపాయిని ఎత్తుకుని, ఆర్డర్‌ డెలీవరి కోసం వెళ్తున్నాడు.

పోస్ట్‌లోని ఫోటోతో పాటు మెహ్రా ఇలా వ్రాశాడు..ఈరోజు జొమాటో డెలివరీ బాయ్ మా స్టోర్ స్టార్‌బక్స్ ఖాన్ మార్కెట్, న్యూఢిల్లీకి ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాడు. అతను మా హృదయాలను గెలుచుకున్నాడు. ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా, పనిలో కూడా తన 2 ఏళ్ల కుమార్తెను జాగ్రత్తగా చూసుకుంటూ కష్టపడుతున్నాడు. అతను సింగిల్ పేరెంట్, తన కుమార్తెను ఒంటరిగా పెంచుతున్నాడు. అతని అంకితభావం, తన కుమార్తె పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా రాశారు.

ఇంకా ఇలా రాశాడు.. అతని ముఖంలో చిన్న చిరునవ్వు తీసుకురావాలనే ఆశతో మేము అతనికి బేబీసినో చిన్న ట్రీట్ ఇచ్చామని కూడా వెల్లడించారు. కష్ట సమయాల్లో కూడా మనిషి ఆత్మవిశ్వాసం,బలం వశ్యతను ఇది మనకు గుర్తు చేసింది. అతనికి, అతని కుమార్తెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనందరిని ఒకటిగా బంధించే దయ, సానుభూతిని గుర్తుచేసే ఇలాంటి చిన్న క్షణాలకు మేము కృతజ్ఞులం అంటూ రాశారు. ఇకపోతే, ఈ డెలివరీ బాయ్‌ పేరు సోనూ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, Zomato సైతం మెహ్రా పోస్ట్‌కి ప్రతిస్పందించింది. డెలివరీ ఏజెంట్ తన పని పట్ల నిబద్ధతతో ఉన్నందుకు ప్రశంసించింది. ఇక సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ విపరీతంగా వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..