Viral Video: దోమల బెడద నుంచి ఇలాక్కూడా తప్పించుకోవచ్చా.. వాట్ ఏ ఐడియా సర్ జీ!

ప్రతీ రోజూ లెక్కలేనన్ని వైరల్ వీడియోలు, చిత్ర విచిత్రమైన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆలోచింపజేసేలా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని అయితే నవ్వు తెప్పిస్తాయి. మనం ప్రతీ రోజూ నిద్రపోయేటప్పుడు దోమలు..

Viral Video: దోమల బెడద నుంచి ఇలాక్కూడా తప్పించుకోవచ్చా.. వాట్ ఏ ఐడియా సర్ జీ!
Viral Photo

Updated on: Apr 09, 2024 | 4:26 PM

ప్రతీ రోజూ లెక్కలేనన్ని వైరల్ వీడియోలు, చిత్ర విచిత్రమైన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆలోచింపజేసేలా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని అయితే నవ్వు తెప్పిస్తాయి. మనం ప్రతీ రోజూ నిద్రపోయేటప్పుడు దోమలు చేసే సౌండ్ అంతా ఇంతా కాదు. వాటిని తరిమికొట్టేందుకు మస్కిటో కొయిల్స్.. లేదా గుడ్‌నైట్ లాంటివి బెడ్‌ రూమ్‌లో పెట్టుకుంటుంటాం. అయితే ఈ యువకుడు కొంచెం కొత్తగా ఆలోచించాడు. దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు ఏం చేశాడో చూస్తే.. మీ మతి పోయినట్టే. పైన పేర్కొన్న వీడియోను మీరు చూశారా.? ఓ యువకుడు తాను నిద్రపోయేటప్పుడు.. దోమల బెడద ఉండకూడదని.. ఏకంగా ఒక పెద్ద అట్టపెట్టెను తన బెడ్‌గా మార్చుకున్నాడు. అంతేకాదు.. తాను పడుకున్న తర్వాత ఆ ఆట్టపెట్టె క్లోజ్ కావడానికి.. పైన ఓ ట్రాన్స్‌పెరెంట్ డోర్ లాంటిది కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాదండోయ్.. పక్కన మస్కిటో కొయిల్ కూడా వెలిగించాడు. ఈ యువకుడు టెక్నిక్‌ను జనాలు ఫిదా అయ్యారు. కాగా, సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.