Watch: ట్రైన్ ఎక్కబోయి పట్టాలపై పడిన యువతి..తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్‌ వీడియో

అలాగే, కొందరు కాళ్లు, చేతులు పోగోట్టుకుని మంచానికే పరిమితమైన వారు కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనల పట్ల రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు ప్రయాణికుల్ని అప్రమత్తం చేస్తూనే ఉంటారు. రైలు వచ్చే ముందు అందరూ అప్రమత్తంగా ఉండాలని, రైలు ఆగిన తర్వాత మాత్రమే ఎక్కాలని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటారు. అయినప్పటికీ చాలా మంది

Watch: ట్రైన్ ఎక్కబోయి పట్టాలపై పడిన యువతి..తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్‌ వీడియో
Young Woman Falls onto Tracks While Attempting to Board Moving Train

Updated on: Nov 05, 2024 | 9:03 PM

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువతి ప్లాట్‌ఫారమ్‌పై నుంచి ట్రాక్‌పై పడిపోయింది. ఆగి ఉన్న రైలు నుంచి ఓ యువతి దిగి స్నాక్స్ కొనుగోలు చేసింది. ఆ రైలు కదలడంతో ఆమె పరిగెత్తి ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించడంతో పట్టాలపై పడిపోయింది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఆమె రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, ఈఘనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ట్రైన్ ఎక్కబోతూ ప్రమాదవశాత్తు పట్టాలపై పడి ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే, కొందరు కాళ్లు, చేతులు పోగోట్టుకుని మంచానికే పరిమితమైన వారు కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనల పట్ల రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు ప్రయాణికుల్ని అప్రమత్తం చేస్తూనే ఉంటారు. రైలు వచ్చే ముందు అందరూ అప్రమత్తంగా ఉండాలని, రైలు ఆగిన తర్వాత మాత్రమే ఎక్కాలని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటారు. అయినప్పటికీ చాలా మంది ఆ మాటల్ని పెడచెవిన పెడుతుంటారు.

కొందరు చేతిలో సెల్ ఫోన్ చూస్తూ రైలు ఎక్కే ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరు ఆలస్యంగా స్టేషన్ చేరుకోవటం వల్ల హడావుడిగా రైలు ఎక్కే ప్రయత్నం చేస్తుంటారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..