ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో పాపులర్ అయ్యేందుకు యువత తలతిక్క పనులు చేస్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం పిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు అలాంటి ప్రయత్నమే చేశాడు. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడి మాదిరి ఎద్దును లొంగదీసుకునేందుకు విఫలయత్నం చేశాడు. ఆ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేయాలంటూ తన మిత్రులకు సూచించాడు. కానీ అతడు అనుకున్నది జరగలేదు. ఎద్దు కొమ్ములు పట్టుకుని వంచేందుకు ప్రయత్నిస్తుండగా.. దానికి ఒక్కసారిగా కోపం వచ్చి ఎత్తి పడేసింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూడగానే నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం. అయితే అతడికి పెద్దగా దెబ్బలకు తగలలేదు కాబట్టి సరిపోయింది. అదే తగలరాని చోట తగిలితే పెద్ద ప్రమాదమే సంభవించేది.
ముందుగా ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి…
తాను ఎంత శక్తివంతుడో చూపించాలనుకున్న యువకుడి ఆరాటం.. ఆ తరువాతి క్షణం ఎద్దు అతనికి జీవితానికి గుర్తుండిపోయేలా నేర్పిన గుణపాఠం మీరు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. నెటిజన్లు లైక్స్, కామెంట్లతో హెరెత్తిస్తున్నారు. జంతువులతో స్నేహం చేయాలని చాలామంది కోరుకుంటారు. వాటిని మచ్చిక చేసుకుని.. అలవాటు చేసుకోవడం వేరు. ఇలా మితిమీరి ప్రవర్తించడం వేరు. ఏదైనా అతి చేస్తే.. పర్యావసనాలు ఇలానే ఉంటాయి.
Also Read:ట్రాఫిక్‌లో బోర్ కొట్టిందని పక్కనే ఉన్న మొసళ్ల నదిలో దూకేశాడు.. ఆ తర్వాత షాక్