Viral News: ఓ ఇంట్లో 8 పాము గుడ్లు కంట‌ప‌డ్డాయి.. ఇతడు అక్క‌డికి వెళ్లి, ఏం చేశాడంటే…

|

May 29, 2021 | 9:58 PM

కోబ్రా గుడ్లు మీ ఇంట్లో క‌నిపిస్తే.. ఏం చేస్తారు. వామ్మో అని చెప్పి స్నేక్ క్యాచ‌ర్‌ను ర‌ప్పించి.. ఆ గుడ్లు పెట్టిన పామును పట్టుకోవ‌డ‌మో, లేక ఆ గుడ్లను జాగ్ర‌త్త‌గా తీసి ఎక్క‌డైనా

Viral News:  ఓ ఇంట్లో 8 పాము గుడ్లు కంట‌ప‌డ్డాయి.. ఇతడు అక్క‌డికి వెళ్లి,  ఏం చేశాడంటే...
Sanke Resuced New
Follow us on

కోబ్రా గుడ్లు మీ ఇంట్లో క‌నిపిస్తే.. ఏం చేస్తారు. వామ్మో అని చెప్పి స్నేక్ క్యాచ‌ర్‌ను ర‌ప్పించి.. ఆ గుడ్లు పెట్టిన పామును పట్టుకోవ‌డ‌మో, లేక ఆ గుడ్లను జాగ్ర‌త్త‌గా తీసి ఎక్క‌డైనా ఇంటికి దూరంగా ప‌డేయ‌డ‌మో చేస్తారు. ఒక వేళ స్నేక్ క్యాచ‌ర్ అయితే వాటిని సేక‌రించి అడ‌విలో వ‌దిలేస్తాడు లేదా ఫారెస్ట్ సిబ్బందికి అప్ప‌గిస్తాడు. కానీ ఓ వ్య‌క్తి మాత్రం వాటిని ఇంటికి తీసుకెళ్లి పొద‌గేశాడు. కోబ్రా గుడ్ల‌కు కృత్రిమంగా వేడిని అందించి.. పిల్లలకు ఆయువు పోశాడు కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. పక్షులు, జంతువులపై ఉన్న మ‌మ‌కారంతో ఇప్పటివరకు వేలాది కోబ్రాలను రక్షించినట్లు చెబుతున్నాడు.

అస‌లేం జ‌రిగిందంటే…

పుత్తూరుకు చెందిన తేజస్​ అనే వ్యక్తి ఇటీవలే ఓ వైద్యుడి ఇంట్లో దొరికిన 8 కోబ్రా గుడ్లను తన సొంతింటికి తీసుకెళ్లాడు తేజస్ అనే వ్య‌క్తి. అటవీ శాఖ అధికారుల అనుమతితో ఆ గుడ్లకు కృత్రిమంగా వేడిని అందించేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. 57 రోజుల తర్వాత గుడ్ల నుంచి కోబ్రా పిల్లలు బయటకు వచ్చాయి. అనంతరం కోబ్రా పిల్లలను వెంటనే అడవిలో వదిలేశాడు తేజస్. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఎన్నో పాములను సేవ్ చేసిన‌ట్లు చెప్పాడు. విషపూరిత స‌ర్పాల‌ను కూడా అలవోకగా పట్టుకుని వాటిని అడవిలో వదిలేస్తున్నట్లు వివ‌రించాడు. ఇలా పాములను రక్షించే క్రమంలో కొన్ని సర్పాలు తనను కాటు వేశాయని వెల్ల‌డించాడు. అయినప్పటికీ జంతువులపై, పక్షులపై ఉన్న ప్రేమతో పాములను రక్షిస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకు దాదాపు 5 వేల కోబ్రాలను రక్షించానన్నాడు తేజస్.

Also Read: నాగుపాముకి నోటితో ఆక్సిజన్​.. కొనఊపిరితో ఉన్న స‌ర్పానికి మళ్లీ ప్రాణం పోసిన వ్య‌క్తి

తెలంగాణ రైతుల‌కు గుడ్ న్యూస్.. రైతు బంధు సాయం పంపిణీకి డేట్ పిక్స్