
సోషల్ మీడియాలో (Social Media) డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. ట్రెండ్ అవుతున్న పాటలకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేసే వీడియోలు కోకొల్లలు. వీటిలో పలు వీడియోలు అప్పటి పరిస్థితులను బట్టి వైరల్ అవుతుంటాయి. ఆశ్చర్యకరమైన వీడియోలు మనల్ని ఔరా అనిపిస్తాయి. ప్రస్తుతం అలాంటి డ్యాన్స్ (Dance Video) కు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ డ్యాన్స్ ను ఆ యువకుడు ఎలా చేశాడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో ఆ వ్యక్తి తన చేతులపై నిలబడి, కాళ్లతో అద్భుతమైన డ్యాన్స్ చేస్తాడు. చాలా మంది వ్యక్తులు తమ చేతులపై నిలబడి నడవడం చూసే ఉంటారు. కానీ హ్యాండ్‌స్టాండ్ చేస్తున్నప్పుడు డ్యాన్స్ చేయడాన్ని మీరు చూశారా.. చూడకపోతే, ఇప్పుడు చూడండి. ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ క్లిప్ లో వ్యక్తి తన చేతులపై నిలబడతాడు. కాళ్లు పైకి లేపి బ్యాలెన్సింగ్ చేసుకుంటాడు. ఇక కాళ్లు ఊపుతూ డ్యాన్స్ చేస్తాడు. మ్యూజిక్ కు తగ్గట్టుగా చిందులేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..