Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: అరెరె ఎంత పనాయెరా.. స్కూటీని కంట్రోల్ చేయలేక ఆ యువతి చేసిన పనికి పడీపడీ నవ్వాల్సిందే..

నేటి కుర్రకారుకు బైక్ లు, స్కూటీలంటే (Scooty) విపరీతమైన క్రేజ్ ఉంది. చిన్న చిన్న ప్రయాణాల కోసం చాలా మంది స్వంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. అయితే రోడ్లపై బైక్ లను నడపడం అంత తేలికైన విషయం..

Video Viral: అరెరె ఎంత పనాయెరా.. స్కూటీని కంట్రోల్ చేయలేక ఆ యువతి చేసిన పనికి పడీపడీ నవ్వాల్సిందే..
Scooty Accident Video Viral
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 14, 2022 | 1:04 PM

నేటి కుర్రకారుకు బైక్ లు, స్కూటీలంటే (Scooty) విపరీతమైన క్రేజ్ ఉంది. చిన్న చిన్న ప్రయాణాల కోసం చాలా మంది స్వంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. అయితే రోడ్లపై బైక్ లను నడపడం అంత తేలికైన విషయం కాదు. ఎదురుగా వస్తున్న వాటిని తప్పించుకుంటూ, రోడ్డు నియమాలు పాటిస్తూ డ్రైవింగ్ చేయడం చాలా కష్టసాధ్యమైన పని. వీటి కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఇందుకు సంబంధించిన వీడియో (Video) లు, ఘటనలు చాలానే ఉన్నాయి. ఇవి భయం కలిగించడమే కాకుండా కొన్ని ఘటనలు నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. స్కూటీలు నడపడం అంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో మనందరికీ బాగా తెలుసు. కానీ చాలా మంది స్కూటీ నడపడంలో నిష్ణాతులు కాదు. యాక్సిలరేటర్‌ను ఎప్పుడు, ఎలా నియంత్రించాలో వారికి అంతగా అవగాహన ఉండదు. తద్వారా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి.

ఇంటర్నెట్‌లో ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజీలో ఓ యువతి స్కూటీలో పెట్రోల్ కొట్టించుకోవడాన్ని చూడవచ్చు. స్కూటీ వెనుక ఓ వ్యక్తి, అతనితో పాటు మరో యువతి నిలబడి ఉంది. పెట్రోల్‌ నింపుకుంటున్న యువతి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్తున్న సమయంలో వెనుక నిలబడ్డ యువతి ఒక్కసారిగా యాక్సిలేటర్‌ను రేస్ చేసింది. దీంతో స్కూటీ ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొడుతుంది. స్కూటీ ముందు ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బంది నియంత్రించుకోలేక ఫిల్లింగ్ మెషిన్ మీద పడిపోతాడు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో ఇండియాస్పీక్స్ అనే ఖాతాతో పోస్ట్ అయింది. వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి