Viral Video: ఈ వీడియో మీ మనుసులను హత్తుకుంటుంది.. చాలా కాలం తర్వాత తోబుట్టువులు కలిసిన వేళ

|

Jun 07, 2022 | 3:31 PM

ఈ వీడియో ప్రజంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చింపాంజీ సొదరుల మధ్య ఉన్న అనుబంధం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది.

Viral Video: ఈ వీడియో మీ మనుసులను హత్తుకుంటుంది.. చాలా కాలం తర్వాత తోబుట్టువులు కలిసిన వేళ
Heart Breaking Video
Follow us on

Trending Video: ఎమోషన్స్ మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనుషుల్లోనే తగ్గిపోయి.. జంతువుల్లో పెరిగాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్‌గా మారింది. రెస్క్యూ ఆపరేషన్ తర్వాత తిరిగి కలుసుకున్న 2 చిన్న చింపాంజీ తోబుట్టువుల వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. కలిసి ఉన్నప్పుడు ఏమి అనిపించదు. దూరమయ్యాకనే అవతలివారు మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది… ఎంత అవసరం అనేది తెలుస్తుంది. మన పక్కనే ఉండేవారు.. ఒక్కసారిగా దూరమైతే చాలా వెలితిగా అనిపిస్తుంది. ఈ చిన్న చింపాజీలను ఒక చోట నుంచి రెస్క్యూ చేశారు అధికారులు. వాటి హెల్త్ కండీషన్ బాగోలేకపోవడంతో.. చికిత్స కోసం రెండింటినీ వేర్వేరు ప్రదేశాలకు తరలించారు. కోలుకున్న అనంతరం.. వాటిని ఒక చోటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఈ బావోద్వేగ దృశ్యం కనిపించింది. చాలా రోజుల తర్వాత ఎదురుపడ్డ.. ఈ చింపాజీ బ్రదర్స్ ఎంతో ఎమోషనల్ అయి హగ్ చేసుకోవడం మీరు చూడవచ్చు. ఈ వీడియో మీ మనసులను తప్పక కదిలిస్తుంది. ఈ ఎమోషనల్ వీడియో చూసిన అందరూ కామెంట్స్ పెడుతున్నారు. ‘నిజంగా ఈ విజువల్స్ నా కంటి వెంట నీరు తెప్పించాయి’ అని ఒకరు రాసుకొచ్చారు.. ‘ఇలాంటి బాండింగ్ మనుషులు అందరిలో కూడా ఉంటే ఎంత బాగుండు’.. అని మరొకరు పేర్కొన్నారు.  ‘దేవుడు వాటి ప్రార్థనలు విన్నాడు. అందుకే ఆ తోబుట్టువులను కలిపాడు’ అని మరొకరు కామెంట్ పెట్టారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..