Viral: ఉల్లి కోసేందుకు వెళ్లిన రైతులు.. కళ్ల మంటలు.. పరీక్షించగా లోపల పురుగులు, గుడ్లు

|

Apr 01, 2023 | 4:13 PM

ఉల్లిపాయలు కోయడానికి పొలానికి వెళ్లిన వ్యవసాయ కూలీలను ఇప్పుడు లేనిపోని సమస్య వెంటాడుతుంది. వారి కళ్ల నుంచి పురుగులు, గుడ్లు రావడం మొదలైయ్యాయి. పూర్తి సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.

Viral: ఉల్లి కోసేందుకు వెళ్లిన రైతులు.. కళ్ల మంటలు.. పరీక్షించగా లోపల పురుగులు, గుడ్లు
Eye Worms (representative image)
Follow us on

మహారాష్ట్రలో.. ఓ విచిత్రమైన ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఉల్లి కోసేందుకు వెళ్లిన రైతుల కళ్లల్లో నుంచి పురుగులు, గుడ్లు బయటకు వచ్చాయి. దీంతో తమకేదైనా అవుతుందేమో అని ఆ రైతులు హడలిపోతున్నారు. దాదాపు 15 మంది రైతులు ఈ వింత సమస్యను ఎదుర్కొన్నారు. అహ్మద్​నగర్​ జిల్లా వాలన్ గ్రామానికి చెందిన కొందరు కూలీలు ఉల్లి పంటను కోసేందుకు చేనుకి వెళ్లారు. పక్వానికి వచ్చిన ఉల్లి  మొక్కలను పీకుతుండగా.. కళ్లలో ఏదో పడి.. మండినట్లు అనిపించింది. ఆ మంట కాసేపటికి పెరిగింది. దీంతో తట్టుకోలేక దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వారికి మెడిసిన్ ఇచ్చి ఇంటికి పంపారు.

కళ్లను నలుముకుంటూనే వారంతా ఇళ్లకు చేరుకున్నారు. డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకున్నాక రిలీఫ్ అనిపిండంతో అందరూ నిద్రలోకి జారుకున్నారు. రాత్రి సమయంలో మళ్లీ.. కళ్లలో మంట మొదలయ్యింది. దీంతో కొందరు రాహులరిలో ఉన్న ఐ హాస్పిటల్‌కు వెళ్లగా.. మరికొందరు జిల్లా ఆస్పత్రికి పరుగులు తీశారు. వారి కళ్లను పరీక్షించిన డాక్టర్లు.. లోపలి నుంచి పురుగులు, వాటి గుడ్లు వస్తున్నట్లు గుర్తించారు. పూర్తి స్థాయిలో నివేదికలు అందాక  వారి ఆరోగ్య సమస్య గురించి కచ్చితంగా వెల్లడించగలమని డాక్టర్లు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..