Bobby Dog: గిన్నిస్‌ రికార్డ్ సాధించిన ఆ శునకం ఇక లేదు.. అత్యంత వయసున్న..

|

Oct 24, 2023 | 9:07 AM

ప్రపచంలోనే అత్యంత వృద్ధ శునకంగా 'బొబీ' అనే శునకం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది. ఈ శునం 11 మే 1992లో జన్మించింది. ఈ శునకం రఫీరో డో అలెంటెజో బ్రీడ్‌కు చెందింది. ఈ శునకం తన జీవితమంతా ఒకే కుటుంబంతో గడిపింది. ఈ శునకం చనిపోయినట్లు దీనిని ఎక్కువ కాలం నుంచి పరీక్షించిన పశు వైద్యుడు డాక్టర్‌ బెకర్ ఫేస్‌బుక్‌ వేదికగా ప్రకటించారు. ఈ శునకం 31 ఏళ్లు జీవించి గిన్నిస్‌ బుక్ లో స్థానం సంపాదించుకుంది...

Bobby Dog: గిన్నిస్‌ రికార్డ్ సాధించిన ఆ శునకం ఇక లేదు.. అత్యంత వయసున్న..
World Oldest Dog
Follow us on

ప్రపంచంలోనే అత్యంత వయసున్న శునకం చనిపోయింది. ఈ శునకం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్‌ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకున్న ఈ శునకం శనివారం పోర్చుగల్‌లో మరణించింది. ఇంతకీ ఈ శునకం వయసు ఎంత.? దీని ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ప్రపచంలోనే అత్యంత వృద్ధ శునకంగా ‘బొబీ’ అనే శునకం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది. ఈ శునం 11 మే 1992లో జన్మించింది. ఈ శునకం రఫీరో డో అలెంటెజో బ్రీడ్‌కు చెందింది. ఈ శునకం తన జీవితమంతా ఒకే కుటుంబంతో గడిపింది. ఈ శునకం చనిపోయినట్లు దీనిని ఎక్కువ కాలం నుంచి పరీక్షించిన పశు వైద్యుడు డాక్టర్‌ బెకర్ ఫేస్‌బుక్‌ వేదికగా ప్రకటించారు. ఈ శునకం 31 ఏళ్లు జీవించి గిన్నిస్‌ బుక్ లో స్థానం సంపాదించుకుంది. ఈ శునకం ఏకంగా 11,478 రోజులు జీవించింది.

ఇదిలా ఉంటే ఈ శునకం కంటే ముందు ఎక్కువ కాలం పాటు జీవించిన శునకంగా ఆస్ట్రేలియాకు చెందిన శునకం రికార్డు సాధించింది. 1939లో బ్లాయ్‌ అనే శునకం ఏకంగా 29 ఏళ్ల 5 నెలలు జీవించింది. అప్పటి వరకు అత్యంత వయసున్న శునకంగా బ్లోయ్‌ పేరుగాంచింది. అయితే బొబీ ఈ రికార్డును ఈ ఏడాది ఫిబ్రవరి రికార్డును అధిగమించింది. ఇక బొబీ మొత్తం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.

సాధారణంగా ఈ జాతికి చెందిన శునకాల జీవిత కాలం 12 నుంచి 14 ఏళ్లు మాత్రమే ఉంటుంది. కానీ బొబీ మాత్రం 31 ఏళ్లు జీవించడం విశేషం. ఇక బొబీ గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకున్న సమయంలో దాని యజమాని మాట్లాడుతూ.. బొబీకి ప్రత్యేకంగా ఎలాంటి ఆహారాన్ని అందించలేదని, తాము తీసుకున్న ఆహారాన్నే అందించామని తెలిపారు. అయితే మసాల దినుసులను తొలగించడానికి బొబీకి ఇచ్చే ఆహారాన్ని నీటిలో నానబెట్టి ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అలాగే శునకాన్ని ఎప్పుడూ తాడుతో బంధించలేదని, దానిని స్వేచ్ఛగా వదిలిపెట్టినట్లు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..