Poisonous plant: మొక్కే కదా అని ముట్టుకోవాలని చూస్తే..! మరణం ఖాయం..

|

Feb 15, 2024 | 12:37 PM

ఈ మొక్క ఆకుల ఉపరితలంపై చిన్న చిన్న ముళ్లులాంటివి ఉన్నాయి. అవి కంటికి కనిపించవు. కానీ ఎవరైనా వాటిని తాకగానే, ఈ ముళ్ళు చర్మంలోకి చొచ్చుకుపోతాయి. అవి మళ్లీ బయటకు వచ్చే వరకు బాధిస్తూనే ఉంటాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Poisonous plant: మొక్కే కదా అని ముట్టుకోవాలని చూస్తే..! మరణం ఖాయం..
Dendrocnide Moroides
Follow us on

భూమిపై ఎన్నో ప్రత్యేకమైన మొక్కలు ఉన్నాయి. కొన్ని మొక్కలు కీటకాలను తిని జీవిస్తాయి. మరికొన్ని రాత్రిపూట కాంతిని విడుదల చేస్తాయి. అయితే ప్రపంచంలో ఒక భయంకరమైన మొక్క ముట్టుకుంటేనే చంపేసి చెట్టు ఒకటి ఉందని మీకు తెలుసా..? ఇది మనుషుల మరణానికి కారణమవుతుంది. అందుకే ఈ మొక్కను విషపు మొక్క అంటారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు, మొక్కల పట్ల ఆసక్తి ఉన్న వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్క. ఈ మొక్క ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. ఈ మొక్క శాస్త్రీయ నామం డెండ్రోక్నైడ్ మోరోయిడ్స్. ఈ మొక్క చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని ఆకులు గుండె ఆకారంలో ఉంటాయి. కానీ ఎవరైనా ఈ మొక్కను పొరపాటున తాకినట్లయితే ఆ వ్యక్తి భరించలేని నొప్పిని అనుభవించవలసి ఉంటుంది. చివరకు ప్రాణాలను కూడా కోల్పోతారు.

ఈ మొక్క ఆకుల ఉపరితలంపై చిన్న చిన్న ముళ్లులాంటివి ఉన్నాయి. అవి కంటికి కనిపించవు. కానీ ఎవరైనా వాటిని తాకగానే, ఈ ముళ్ళు చర్మంలోకి చొచ్చుకుపోతాయి. అవి మళ్లీ బయటకు వచ్చే వరకు బాధిస్తూనే ఉంటాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ మొక్క ఆకులపై ఉండే ఆ ముళ్లు చాలా చిన్నవిగా ఉండి..చాలా విషపూరితమైనవి. ఇవి ఒక్కసారి చర్మంలోకి చేరితే అంత ఈజీగా బయటకు రావు. అవి చర్మంలోకి చొచ్చుకుపోయి విపరీతమై నొప్పిని కలిగిస్తాయి. ఇంతవరకు ఈ మొక్క ఆకులు గుచ్చితే కలిగే నొప్పికి మందును తయారు చేయలేదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మొక్కలు భారతదేశంలో ఇంతవరకు ఎవరూ గుర్తించలేదు. దీనిని ఆస్ట్రేలియాలో మాత్రమే గుర్తించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..