AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

36 ప్లాట్‌ఫారమ్‌లు.. 200 ఎంట్రీ గేట్స్.. రోజూ 38 లక్షల మంది జర్నీ.. ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ ఇదే!

Busiest Railway Station in the World: మన దేశంలో రైల్వే స్టేషన్ అంటేనే జనసంద్రం. రైలు ఎక్కాలన్నా, దిగాలన్నా కిటకిటలాడే గుంపులు, ప్లాట్‌ఫారమ్‌లపై రద్దీ సర్వసాధారణం. అయితే, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ భారతదేశంలోనో లేదా అత్యధిక జనాభా ఉన్న చైనాలోనే ఉండి ఉంటుందని మనం భావిస్తే పొరపాటే. రోజుకు ఏకంగా 38 లక్షల మందికి పైగా ప్రయాణికులతో నిరంతరం రణగొణధ్వనిగా మారే ఆ అద్భుత రైల్వే స్టేషన్ ఎక్కడుందో, దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

36 ప్లాట్‌ఫారమ్‌లు.. 200 ఎంట్రీ గేట్స్.. రోజూ 38 లక్షల మంది జర్నీ.. ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ ఇదే!
Shinjuku Station Tokyo Japan
Venkata Chari
|

Updated on: Jun 09, 2026 | 1:01 PM

Share

Busiest Railway Station in the World: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలుగా భారత్, చైనాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. సహజంగానే ఈ దేశాల్లోని పబ్లిక్ రవాణా వ్యవస్థలు ఎప్పుడూ కిక్కిరిసిపోతుంటాయి. కానీ, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకెక్కిన ఘనత మాత్రం జపాన్ రాజధాని టోక్యోలోని శింజుకు (Shinjuku) రైల్వే స్టేషన్‌ దక్కించుకుంది. వైశాల్యంలో చిన్నదైనప్పటికీ, సాంకేతికతలో, రవాణా నిర్వహణలో జపాన్ ఎంత ముందో చెప్పడానికి ఈ స్టేషనే ఒక నిదర్శనం. ఒక ఏడాదిలో ఈ స్టేషన్ గుండా ప్రయాణించే వారి సంఖ్య దాదాపు 127 కోట్లు అంటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.

స్టేషన్ లోపలే ఒక చిన్న ప్రపంచం..!

శింజుకు రైల్వే స్టేషన్ అనేది కేవలం రైళ్లు వచ్చి వెళ్లే ఒక సాధారణ ప్రదేశం కాదు. ఇది లోపల ఒక చిన్న నగరాన్ని తలపిస్తుంది. ఈ స్టేషన్‌లో ప్రయాణికుల రాకపోకల కోసం 200 కంటే ఎక్కువ ఎంట్రీ గేట్లు, 36 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులతో ఈ ప్రాంతం ఎప్పుడూ ఉత్సాహంగా, చురుగ్గా కనిపిస్తుంది. ప్రయాణికులు రైళ్ల కోసం ఎదురుచూసే సమయంలో బోర్ కొట్టకుండా ఉండేందుకు, ఇక్కడ షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, అండర్‌గ్రౌండ్ టన్నెల్స్, అనేక రకాల దుకాణాలు అందుబాటులో ఉన్నాయి.

తూర్పు, పడమరల అద్భుత సమ్మేళనం..

ఈ స్టేషన్ లోపల అడుగుపెట్టిన వారికి తూర్పు, పడమర వైపులా పూర్తిగా భిన్నమైన వాతావరణం అనుభవంలోకి వస్తుంది. స్టేషన్ తూర్పు ప్రవేశ ద్వారం వైపు వెళ్తే రంగురంగుల వినోద ప్రపంచం, షాపింగ్ కేంద్రాలు స్వాగతం పలుకుతాయి. అదే పశ్చిమ ద్వారం వైపు వెళ్తే గగనతలాన్ని తాకే ఆధునిక కార్పొరేట్ కార్యాలయాలు, స్కైస్క్రాపర్లు కనిపిస్తాయి. దీనికి కాస్త దూరంలోనే మనసుకు ప్రశాంతతను ఇచ్చేలా పచ్చదనంతో నిండిన ‘శింజుకు గ్యోయెన్’ జాతీయ ఉద్యానవనం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

పర్యాటకులను మైమరపించే టోక్యో అందాలు..

శింజుకు స్టేషన్ పశ్చిమ ద్వారం నుంచి కేవలం 10 నిమిషాల నడక దూరంలో ‘టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ బిల్డింగ్’ ఉంటుంది. ఈ భవనంపై ఉన్న అబ్జర్వేటరీ నుంచి చూస్తే, వాతావరణం అనుకూలించినప్పుడు ప్రపంచ ప్రసిద్ధ ‘ఫుజి పర్వతం’ స్పష్టంగా కనిపిస్తుంది. దీనితో పాటు, ఈ ప్రాంతానికి సమీపంలోనే ‘కబుకిచో’ అనే మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం ఉంది. ఇక్కడ రాత్రి వేళల్లో సందడి ఎక్కువగా ఉంటుంది. రకరకాల రెస్టారెంట్లు, థియేటర్లు, క్లబ్‌లు, మ్యూజిక్ బార్లతో ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో కలకలలాడుతుంటుంది.

రవాణా రంగంలో జపాన్ సాధించిన అద్భుత ప్రగతికి, వారి సమయపాలనకు శింజుకు రైల్వే స్టేషన్ ఒక మచ్చుతునక. రోజుకు లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నా, ఎక్కడా చిన్న ట్రాఫిక్ అంతరాయం కూడా లేకుండా పకడ్బందీగా నిర్వహించడం జపాన్ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం. టోక్యో పర్యటనకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన విస్మయపరిచే ప్రదేశాలలో ఈ రైల్వే స్టేషన్ ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
16 ఏళ్లకే హీరోయిన్..మూడో చిత్రంతోనే సంచలనం..
16 ఏళ్లకే హీరోయిన్..మూడో చిత్రంతోనే సంచలనం..
హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా పవర్‌ఫుల్ హెలికాప్టర్!
హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా పవర్‌ఫుల్ హెలికాప్టర్!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ ఇదే..!
తొలి మ్యాచ్‌లో తుస్సు మనిపించిన వైభవ్..!
తొలి మ్యాచ్‌లో తుస్సు మనిపించిన వైభవ్..!
విమానంలో పొగ తాగడం నేరం.. మరి టాయిలెట్‌లో ఆ 'యాష్ ట్రే' ఎందుకు?
విమానంలో పొగ తాగడం నేరం.. మరి టాయిలెట్‌లో ఆ 'యాష్ ట్రే' ఎందుకు?
ఓరీ దేవుడో.. గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకుంటే కంటి చూపు గోవిందా!
ఓరీ దేవుడో.. గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకుంటే కంటి చూపు గోవిందా!
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి