పండ్లలలో రారాజు మామిడి పండు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వీటిని ఇష్టపడని వారుండరు. వేసవి కాలం వచ్చిందంటే మామిడి విరివిగా లభిస్తాయి. సాధారణంగా మామిడి పండు మనిషి అరచేతిలో పట్టేంత పెద్దగా ఉంటుంది. ఇక కొన్ని మన చేయి కంటే కాస్త పెద్దగా ఉంటాయి. కానీ మీరు ప్రపంచంలోనే అత్యంత పెద్ద మామిడి పండ్లను చూశారా ? అవి దాదాపు 4 కిలోల కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ ఈ పండ్లు మన దేశంలో లేవండోయ్. కొలంబియా దేశంలో ఈ అరుదైన మామిడి పండ్లు ఉన్నాయి. అసలు విషయానికి వస్తే.
మామిడి ప్రియుల డిమాండ్ తీర్చేందుకు కొలంబియాకు చెందిన ఇద్దరు రైతులు ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడిని పండించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కారు. జర్మన్ ఒర్లాండ్ నోవోవా అతని భార్య రీనా మారియా మారోక్విన్ ఈ మామిడి పండ్లను పండించారు. వీటి బరువు దాదాపు 4.25 కిలోలు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనే ఇన్ స్టా యూజర్ ఈ పండ్ల గురించి పోస్ట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడి పండ్ల ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.