Viral Video: కండ బలం కంటే.. బుద్ధి బలమే గొప్పదని పెద్దలు చెబుతుంటారు. దీనినే కార్పొరేట్ యుగం కొంచెం ట్రెండీగా ‘హార్డ్ వర్క్ కాదు స్మార్ట్’ వరకు చేయాలని చెబుతుంది. ఎవరు ఏ భాషలో చెప్పిన ఈ సూక్తి మాత్రం ముమ్మాటికీ నిజం. కష్టపడి చెమట కార్చి చేసేకంటే తెలివిగా ఆలోచించి, అదే పనిని సింపుల్‌గా చేయొచ్చు. నిజానికి మనుషుల జీవితాలు ఈ రోజు ఇంత సింపుల్‌గా మారాయంటే దానికి స్మార్ట్ వర్కే కారణమని చెప్పాలి. అయితే స్మార్ట్ వర్క్ కేవలం పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారికే పరిమితమా అంటే, ముమ్మాటికీ కాదు. ఎందుకంటే సమాజంలో పెద్దగా చదువుకోని వారు కూడా తమ తెలివితో స్మార్ట్ వర్క్ చేస్తూ సమయాన్ని, శక్తిని ఆదా చేస్తుంటారు.
ఎంతో కష్టమైన పనులను కూడా ఎంతో సింపుల్‌గా పూర్తి చేస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో స్మార్ట్ వర్క్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది. సాధారణంగా రేకులను మేడపైకి ఎక్కించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ కొందరు తమ తెలివితో సింపుల్‌గా పైకి ఎక్కించారు. కోళ్ల ఫారం షెడ్ నిర్మించే క్రమంలో రేకులను ఫస్ట్ ఫ్లోర్‌కి ఎక్కించేందుకు ఒక తెలివైన టెక్నిక్‌ను ఉపయోగించారు.
ముందుగా పైకి రెండు పెద్ద రాడ్లను ఏర్పాటు చేసి, రేకులను తాడు సహాయంతో అవలీలగా పైకి పంపించారు. అప్పటికే పైన ఉన్న ఇద్దరు రేకులను తీసుకోవడం చక చక చేసేశారు. ఇలా ఎంతో కష్టమైన పనిని కూడా తమ స్మార్ట్ వర్క్‌తో సింపుల్‌గా పూర్తి చేశారు. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేడయంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కార్మికుల తెలివికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Bandi Sanjay: భాష, యాస పేరుతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్న టీఆర్‌ఎస్‌ను నమ్మొద్దుః బండి సంజయ్ \
Errabelli Dayakar Rao: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి
Errabelli Dayakar Rao: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి