Viral News: అదృష్టం అంటే ఆమెదే.. రూ.200 పెట్టుబడితో లక్షలు లాభం.. రాత్రికి రాత్రే మారిన ఆమె జీవితం..

|

May 28, 2022 | 6:03 PM

Viral News: టైమ్ వస్తే జీవితం మారిపోతుంది అనటానికి ఆమె జీవితమే ఒక ఉదాహరణ అని చెప్పుకోవాలి. అవును ఇది అక్షరాలా నిజం ఎందుకంటే.. కేవలం రూ.200 పెట్టుబడితో లక్షలు సంపాదించటం అంత సులువుకాదు.

Viral News: అదృష్టం అంటే ఆమెదే.. రూ.200 పెట్టుబడితో లక్షలు లాభం.. రాత్రికి రాత్రే మారిన ఆమె జీవితం..
DA
Follow us on

Viral News: టైమ్ వస్తే జీవితం మారిపోతుంది అనటానికి ఆమె జీవితమే ఒక ఉదాహరణ అని చెప్పుకోవాలి. అవును ఇది అక్షరాలా నిజం ఎందుకంటే.. కేవలం రూ.200 పెట్టుబడితో లక్షలు సంపాదించటం అంత సులువుకాదు. పైగా ఈ రోజుల్లో అది ఈజీ కూడా కాదు. ఇంతకూ అసలు ఆమె చేసిదేంటంటే.. కేవలం ప్రభుత్వానికి చెందిన భూమిని లీజుకు తీసుకోవటమే. ఆ తరువాత వజ్రాల వేట ప్రారంభించిన ఆమెకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. మూడు నెలల కష్టం ఆమె జీవితాన్నే మార్చేసింది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. మధ్యప్రదేశ్‌లోని పన్నాకు చెందిన ఛమేలీ బాయి కృష్ణ అనే మహిళ కల్యాణ్‌పూర్ బెల్ట్‌లో అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన మైనింగ్ కోసం ఫిబ్రవరిలో లీజుకు తీసుకుంది. అక్కడ తవ్వకాలు చేపడుతుండగా ఆమె పంట పండింది. 2.08 క్యారెట్లు బరువైన వజ్రం ఒకటి ఆమెకు దొరికింది. దాని విలువ సుమారు రూ.10 లక్షలని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 24న ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిని ఆమె భర్తతో కలిసి పన్నాలోని డైమండ్స్ ఆఫీస్ లో డిపాజిట్ చేసింది. దీనిని వేలం వేయటం వల్ల దాదాపు రూ.10 నుంచి రూ.12 లక్షలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ సమాచారం అందుకున్న స్థానికులు ఆ వజ్రాన్ని చూసేందుకు బారులు తీస్తున్నారు. మీడియా కూడా ఈ విషయాన్ని తెలుసుకోవటంతో ఆమెతో ఇంటర్వ్యూలు ప్రారంభించాయి. ఈ డబ్బుతో తాము సొత్తిల్లు కొనుక్కోవాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఆమెకు వేలం ద్వారా వచ్చే మెుత్తంలో 1 శాతం టాక్స్, 12 శాతం రాయల్టీ చెల్లించిన తరువాత సుమారు రూ.9 లక్షల వరకు వస్తాయని తెలుస్తోంది. దీంతో అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారాలని ఆ కుటుంబం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి