స్మార్ట్‌ఫోన్.. మనిషి జీవితాన్ని ఒక్కసారిగా మార్చిన ఆవిష్కరణల్లో ఇదీ ఒకటి. స్మార్ట్ ఫోన్‌లు వచ్చాక మనిషి జీవన విధానమే మారిపోయింది. ఏ పని చేయాలన్నా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. స్మార్ట్ ఫోన్ పక్కన లేకపోతే ఏదో కోల్పోయామన్న భావన. ప్రతీ చిన్న పనికి స్మార్ట్ ఫోన్ అత్యవసరంగా మారిపోయిన ఈ రోజుల్లో చేతిలో ఫోన్‌లేకపోతే క్షణం గడిచేలా లేదు. అయితే అతి ఎప్పుడూ అనర్థాలకు దారి తీస్తుందన్నట్లు స్మార్ట్ ఫోన్ వినియోగం అతి కూడా ప్రమాదాలకు దారి తీస్తుంది. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకొవచ్చు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేసిన ఓ వీడియో స్మార్ట్ ఫోన్ మనిషిని ఎంతలా మార్చేసిందో చెబుతోంది. ఓ మహిళ స్మార్ట్ ఫోన్‌ను చూసుకుంటూ వెళ్తూ ప్రమాదానికి గురైన సంఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సజ్జనార్.. ‘మొబైల్ ఫోన్ మాయజాలం! ముందు వెనక చూడకుండా ఫోన్ వాడుకుంటూ వెళ్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. ఫోనే జీవితం కాదు కదా. పొద్దస్తమానం ఫోన్ వాడకాన్ని తగ్గించండి. అవసరానికే వినియోగించండి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మొబైల్ ఫోన్ మాయజాలం!
ముందు వెనక చూడకుండా ఫోన్ వాడుకుంటూ వెళ్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. ఫోనే జీవితం కాదు కదా. పొద్దస్తమానం ఫోన్ వాడకాన్ని తగ్గించండి. అవసరానికే వినియోగించండి. pic.twitter.com/FEH2EcNiit
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 28, 2023
మరిన్ని వైరల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..