పిచ్చి పీక్ స్టేజ్.. నవ్వితే స్పెషల్‌గా ఉండాలని చివుళ్లకు టాటూ వేయించుకున్న యువతి..

|

Mar 16, 2024 | 12:41 PM

ప్రస్తుతం టాటూ ట్రెండ్ నడుస్తోంది. యువతీ యువకులు రకరకాల టాటూ లను వేయించుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. చాలా మంది  చేతులు, కాళ్ళు, ఛాతీ , వీపు మీద ఇలా రకరకాల ప్లేస్ లో టాటూ లను వేయించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఓ యువతి తన చిగుళ్లపై టాటూ వేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది . వీడియో చూసిన నెటిజన్లు యువతి టాటూ పిచ్చిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

పిచ్చి పీక్ స్టేజ్.. నవ్వితే స్పెషల్‌గా ఉండాలని చివుళ్లకు టాటూ వేయించుకున్న యువతి..
Tattoo Viral Video
Follow us on

కొన్ని తరాల ముందు వరకూ పచ్చబొట్టుని తమకు నచ్చిన పేరునో, దేవుళ్ల బొమ్మలనో శరీరం మీద వేయించుకునే వారు. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా పచ్చ బొట్టు కనుమరుగై.. వాటి ప్లేస్ లో టాటూ లు వచ్చాయి. ప్రస్తుతం టాటూ ట్రెండ్ నడుస్తోంది. యువతీ యువకులు రకరకాల టాటూ లను వేయించుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. చాలా మంది  చేతులు, కాళ్ళు, ఛాతీ , వీపు మీద ఇలా రకరకాల ప్లేస్ లో టాటూ లను వేయించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఓ యువతి తన చిగుళ్లపై టాటూ వేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది . వీడియో చూసిన నెటిజన్లు యువతి టాటూ పిచ్చిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మార్చి 4న ఈ వీడియో @liyanhai33 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భాగస్వామ్యం చేయబడింది. 10 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ వీడియోలో యువతి చిగుళ్లపై పచ్చబొట్టు కనిపిస్తోంది.  6 వేలకు పైగా లైక్ చేశారు కూడా.. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

 గమ్ టాటూ  వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:


యువతి చిగుళ్లపై టాటూ ని చూసిన చాలా మంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది అమ్మాయి తీరుపై ఆలోచనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనిషి శరీరం ప్రకృతి ఇచ్చిన వరం.. ఆ ప్రకృతి సౌందర్యాన్ని కృత్రిమమైన ఆకర్షణలతో ఎందుకు పాడుచేయాలి అంటూ రకరకాల కామెంట్స్ చేస్తూ విరుచుకు పడుతున్నారు

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..