Diwali 2021: దీపావళి వెలుగులు అంటే ఇవేనేమో.. ఎల్‏ఈడీ లైట్ల చీర కట్టి తెగ మురిసిపోతున్న యువతి..

|

Nov 04, 2021 | 9:34 AM

దీపావళి అంటే దీపాల పండగ.. వేడుకలోనే కాదు. ఈ పండుగను ఎంతో ఆనందంగా.. ఘనంగా జరుపుకుంటారు... లక్ష్మీ దేవిని ఆరాధించి..

Diwali 2021: దీపావళి వెలుగులు అంటే ఇవేనేమో.. ఎల్‏ఈడీ లైట్ల చీర కట్టి తెగ మురిసిపోతున్న యువతి..
Led Saree
Follow us on

దీపావళి అంటే దీపాల పండగ.. వేడుకలోనే కాదు. ఈ పండుగను ఎంతో ఆనందంగా.. ఘనంగా జరుపుకుంటారు… లక్ష్మీ దేవిని ఆరాధించి.. మిఠాయిలు పంచి.. ఇళ్లంతా దీపాలు.. రంగవల్లులు.. పూలతో అలకరించి సంప్రదాయబద్ధకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్ని పండుగల కంటే.. దీపావళి పండుగ చాలా స్పెషల్.. పేద, మధ్య, ధనిక అనే తేడా లేకుండా పూరి గుడిసె నుంచి భవంతుల వరకు దీపాలు.. లైట్లతో మెరిసిపోతుంటాయి. ఇంటి నిండా దీపాలు వెలిగించి… ఇంటిని అందంగా ముస్తాబు చేస్తారు. ఇక్కడివరకు బాగానే ఉంది.. కానీ.. దీపాల వెలుగులో ఇంట్లో ఉంటే అందం.. ఆ వెలుగులు ప్రతి ఒక్కరి జీవితంలో రావాలని ఆశిస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం దీపావళి వెలుగులను చీరలో బంధించేసింది.

ఎల్‏ఈడీ లైట్లు అమర్చిన చీర కట్టుకుని తెగ మురిసిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పాతదే అయిన ఇప్పుడు మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఎల్ఈడీ లైట్లు అమర్చిన చీర కట్టుకుని ఆ యువతి సంబరపడిపోతున్న తీరు చేస్తూంటే… దీపావళి వెలుగులు తన ముఖంలోనే కనిపిస్తున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఇలాంటి చీరలు కట్టుకోవడం ప్రాణాలకు ప్రమాదమని.. ఇలాంటివి చేయకండి అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దీపావళి వెలుగులు తన జీవితంలోకి వచ్చేసినంత ఆనందంగా ఆ యువతి సంబరపడిపోతుంది. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి..

Also Read: Tamanna: మిల్కీబ్యూటీ లక్కీ ఛాన్స్.. చిరంజీవి సినిమా కోసం తమన్నాకు ఎంత రెమ్యూనరేషన్ అంటే..

Trisha: అరుదైన రికార్డు సృష్టించిన త్రిష.. ట్విట్టర్‏లలో శుభాకాంక్షల వెల్లువ.. అసలు మ్యాటరేంటంటే..

Bigg Boss 5 Telugu: నారీ నారీ నడుమ మురారీ.. జెస్సీ ఆశలు మాములుగా లేవుగా..

Balakrishna: బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎంటర్‏టైన్‏మెంట్ షూరు.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..