Watch: రీల్స్ పిచ్చి.. తుపాకీ పట్టుకొని హైవేపై రీల్స్ చేసిన మహిళ.. ఆ తర్వాత ఏమైందంటే..?

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పోలీసులు సుమోటోగా స్పందించి విచారణ ప్రారంభించారు. సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక సోషల్ మీడియాలో వీడియ చూసిన చాలా మంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. రీల్స్ పిచ్చిలో ఏం చేస్తున్నారో తెలియడం లేదంటూ నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Watch: రీల్స్ పిచ్చి.. తుపాకీ పట్టుకొని హైవేపై రీల్స్ చేసిన మహిళ.. ఆ తర్వాత ఏమైందంటే..?
Woman Waves Gun In Air

Updated on: Jul 09, 2025 | 3:04 PM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా రీల్స్ అనేది ఒక వ్యసనంగా మారింది. చాలా మంది ఫేమస్ అయ్యేందుకు ఇదే ప్లాట్‌ఫామ్‌పై రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు తమలోని ప్రత్యేకమైన నైపుణ్యాలను, కళలను, ఆలోచనలను రీల్స్ ద్వారా బయటపెడుతున్నారు. దాంతో కొందరు రాత్రికి రాత్రే పాపులర్‌ అయిన వారు కూడా ఉన్నారు. ఒకప్పుడు ప్రజలు తమలోని టాలెంట్ ను నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు అలా కాదు.. సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోతున్నారు. కానీ మరికొందరు ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఇబ్బందుల్లో పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ యువతి చేసిన ఇలాంటి ఘటనే ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓ యువతి చేతిలో తుపాకీ పట్టుకొని రీల్స్ చేసింది. ఈ ఘటన ఛిబ్రామౌ ప్రాంతంలోని జాతీయ రహదారి 34పై చోటుచేసుకుంది. నడి రోడ్డుపై ఆ యువతి తుపాకీ చేతపట్టి తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పోలీసులు సుమోటోగా స్పందించి విచారణ ప్రారంభించారు. సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఇక సోషల్ మీడియాలో వీడియ చూసిన చాలా మంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. రీల్స్ పిచ్చిలో ఏం చేస్తున్నారో తెలియడం లేదంటూ నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..