Watch: చేసిందంతా చేసింది..! చివరకు క్యాబ్ డ్రైవర్‌పై నిందలేస్తూ లేడీ డాన్ దాడి.. వీడియో చూస్తే..?

|

Jan 25, 2025 | 12:58 PM

దీంతో ఆమె విమానాశ్రయంలో చెక్ ఇన్ చేయడానికి ముందే విమానం బయలుదేరింది. దీంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. తనను తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్‌పై దాడికి దిగింది. తను చేసిన తప్పును ఒప్పుకోని ఆ యువతి.. ఫ్లైట్ మిస్సవడానికి క్యాబ్‌ డ్రైవర్‌ కారణమంటూ అతనిపై అసభ్య పదజాలంతో దాడి చేసింది. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ అజ్ఞాత వ్యక్తి వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Watch: చేసిందంతా చేసింది..! చివరకు క్యాబ్ డ్రైవర్‌పై నిందలేస్తూ లేడీ డాన్ దాడి.. వీడియో చూస్తే..?
Cab Driver Got Attacked
Follow us on

చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ప్రజా రవాణా రద్దీ కారణంగా క్యాబ్ సర్వీస్ విరివిగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా చేతిలో మొబైల్‌ ఫోన్‌ ఉంటే.. చాలు వాహనం తాము ఉన్న ప్రదేశానికే వస్తుంది.. తాము వెళ్లాలనుకున్న చోట జాగ్రత్తగా, వేగంగా వెళ్లిపోవచ్చు. ప్రజా రవాణాలో ఇటువంటి సౌకర్యాలు లేకపోవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇటువంటి క్యాబ్ సేవలను ఉపయోగిస్తున్నారు. అలాంటిది ఓ యువతి తన ఫ్లైట్ మిస్సవడంతో క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసిన వీడియో ఫుటేజీ కలకలం రేపుతోంది.

ఫ్లైట్ మిస్‌ అయిందనే కోపంతో క్యాబ్ డ్రైవర్‌పై యువతి దాడి చేసింది. ముంబైకి చెందిన ఓ యువతి విమాన టిక్కెట్టు బుక్ చేసుకుంది. కానీ, ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేందుకు ఇంటి నుండి ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ఆమె విమానాశ్రయంలో చెక్ ఇన్ చేయడానికి ముందే విమానం బయలుదేరింది. దీంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. తనను తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్‌పై దాడికి దిగింది. తను చేసిన తప్పును ఒప్పుకోని ఆ యువతి.. ఫ్లైట్ మిస్సవడానికి క్యాబ్‌ డ్రైవర్‌ కారణమంటూ అతనిపై అసభ్య పదజాలంతో దాడి చేసింది. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ అజ్ఞాత వ్యక్తి వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన నెటిజన్లు యువతి తీరుపై మండిపడుతున్నారు. నేటితరం యువత అమానుషం, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒక అమాయక డ్రైవర్ తప్పు చేసినందుకు అతనిపై దాడి చేయడం దారుణం అంటూ మరొకరు పోస్ట్ చేశారు. మహిళను అరెస్ట్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..