
తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ చేస్తుండగా ఓ మహిళ కాస్త అనుమానాస్పదంగా కనిపించింది. ఆమెను ఆపి.. పరిశీలించగా.. తన ప్యాంట్‌లో నుంచి ఏకంగా 1 కేజీ బతికి ఉన్న పురుగులను బయటకు తీశారు అధికారులు. మొదటిగా ఆమె పొత్తికడుపు ఉబ్బినట్టుగా కనిపించింది. కానీ కొంచెం అది తేడాగా ఉండటంతో.. అధికారులకు అనుమానం వచ్చింది. ఆపై తనిఖీల్లో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ ఘటన చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది.
అక్కడ అక్రమంగా కీటకాలను రవాణా చేయడం నిషేధం. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. సదరు మహిళతో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ప్రయాణీకులను కూడా చెక్ చేయగా.. రెండో మహిళ నడుము చుట్టూ సాక్సు కట్టుకుని అందులో 2 కిలోల సజీవంగా ఉన్న పురుగులను దాచిపెట్టడాన్ని అధికారులు గమనించారు. మూడో ప్రయాణీకురాలు జేబులు, వీపున తగిలించుకునే సంచుల్లో పురుగులను దాచిపెట్టింది. వారి దగ్గర ఉన్న వెదురు రంగు పురుగులకు చైనాలో భలే గిరాకీ అని.. అందుకే వీరంతా అక్రమంగా రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురి మహిళలను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు.