Woman: కంటిలో నొప్పి ఉందని ఆస్పత్రికి వెళ్లిన మహిళకి ఆశ్చర్యకరమైన నిజం తెలిసింది. వైద్యులు చెప్పిన మాటలు విని ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురైంది. అన్ని టెస్ట్‌లు చేసిన వైద్యులు ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా బోరున విలపించడం మొదలెట్టింది. ఈ కేసు బ్రిటన్‌లోని లీడ్స్ నగరంలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
సారా కార్డ్‌వెల్ అనే మహిళ కొన్ని రోజులుగా కంటి సమస్యతో బాధపడుతోంది. ఈ కారణంగా ఆమెకు చూపు సరిగ్గా కనిపించేది కాదు. కొన్ని రోజుల తర్వాత ఆమె కంటి పరీక్షలు చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లింది. అప్పుడు ఆమెకు భయంకరమైన నిజం తెలిసింది. డాక్టర్లు ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్దారించారు. ఈ విషయం తెలియడంతో ఆ మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు, ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తుంది.
ఈ సంఘటన గురించి మహిళ ఇలా చెప్పుకొచ్చింది. తానకు చాలా రోజుల నుంచి కళ్లు సరిగ్గా కనబడటం లేదని కళ్లద్దాలు మార్చినా ఏ మాత్రం తేడాలేదని చెప్పింది. అప్పుడే తాను ఆస్పత్రికి వెళ్లానని వైద్యులు పరీక్షించిన తర్వాత అసలు విషయం తెలిసినట్లు పేర్కొంది. దీని గురించి వైద్యులు మాట్లాడుతూ.. మహిళ మెదడులో కణితి కనిపించిందని తెలిపారు. బ్రెయిన్ ట్యూమర్ ఆప్టిక్ నరాల మీద సంభవించిందని అది చాలా ప్రమాదకరమైనదని వివరించారు. తరువాత వైద్యులు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలని మహిళకు సూచించారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే సర్జరీ చేసినా కణితి మళ్లీ పెరుగుతుందని చెప్పారు.