
ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేమికుల దినోత్సవం జరుపుకోనుంది.. ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఈ బహుమతులు వారి సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ బహుమతులలో ప్రేమకు చిహ్నంగా చెప్పే హృదయానికి ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే చాలా మంది హార్ట్ సింబల్‌తో ఉండే వివిధ రకాలైన గిఫ్ట్‌లను తమ ప్రియమైన వారికోసం కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు తమ ప్రేమనంతా కరిగించి పోతపోసినట్టుగా స్వయంగా బహుమతులు తయారు చేసి ఇస్తుంటారు. అయితే, ఈ వాలెంటైన్స్ డే అనేది కేవలం ప్రేమించుకుంటున్న వారికి మాత్రమే కాదు..పెళ్లైన దంపతులకు కూడా ప్రత్యేకమే. అవును పెళ్లి తర్వాత కూడా భార్యభర్తలు అంతే ప్రేమగా ఉంటారని చెప్పేందుకు ఉదాహరణగా ఇంటర్‌నెట్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఫిబ్రవరి నెల అంటేనే యువతీ యువకుల్లో ఏదో కొత్త ఉత్సహం కనిపిస్తుంది. ఈ నెల మొదటి రెండోవారం మొదలైన దగ్గర నుంచి సోషల్ మీడియా వేదికగా వాలంటైన్స్ వీక్ సందడి మొదలవుతుంది. గత రెండు మూడు రోజులుగా ఎక్కుడ చూసినా ఇదే హడావుడి హంగామా సందడి చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా వాలంటైన్స్ వీక్ సంబంధించిన పోస్టులు, రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇల్లాలు తన భర్త కోసం చేసిన ప్రేమ కానుక నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రేమ కోసం ఖరీదైన కానుకలే కాదు. ఇలాంటి గిఫ్ట్ కూడా ఉంటుందని చెబుతోంది. ఇంతకీ ఆ మహిళ తన భర్త కోసం వాలెంటైన్స్ గిఫ్ట్‌గా ఏం ఇచ్చిందో వీడియోలో చూడాల్సిందే..
వీడియో ఇక్కడ చూడండి..
ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో ఒక మహిళ తన భర్త కోసం వెరైటీగా చపాతీలు తయారు చేసింది. రోజూ రెగ్యూలర్‌గా చేసే రోటీలను కాస్త భిన్నంగా తయారు చేసింది. వాటిని తన భర్తకు వాలెంటైన్స్ డే బహుమతిగా ఇచ్చింది. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే ఎరుపు రంగుతో పాటు ఆకు పచ్చ రంగులో రెండు చపాతీలను తయారు చేసింది. వాటి మధ్యలో హార్ట్ సింబల్ ఆకారంలో చిన్న ముక్కలు అతికించింది. గ్రీన్ కలర్ చపాతీలో రెడ్‌కలర్ హార్ట్, రెడ్‌కలర్‌లో గ్రీన్ కలర్ హార్ట్ సింబల్‌ని పెట్టి అతనికి అందించింది. ఇదంతా వీడియో తీసి “వాలెంటైన్స్ డే చపాతీ” అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది.. యధావిధిగానే వీడియో కాస్త విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..