నిజమే.. ఒక్కొక్కరి కొందరి ప్రవర్తన చూస్తే షాకింగ్‌గా అనిపిస్తుంది.. ప్రయాణంలో మన పక్కన కూర్చునే వారి పద్దతి.. వారు ఇతరులతో వ్యవహరించే తీరు ఆశ్చర్యంగా.. వింతగా కనిపిస్తాయి.. ఇక విమాన ప్రయాణాలలోనూ కొందరి ప్రయాణికులు చేసే పనులు కోపం తెప్పిస్తుంటాయి.. హంగామా చేయడం.. ఇష్టానుసారంగా మాట్లాడటం.. ఎదుటివారికి చిరాకు తెప్పిస్తాయి… ఇలాంటి వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా విమానంలో ఓ అమ్మాయి చేసిన పని చూస్తే షాకవుతారు.. తాను కూర్చున్న సీటులో నుంచి మరో సీటు వద్దకు వెళ్లేందుకు ఆ అమ్మాయి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
అందులో ఓ అమ్మాయి.. తన సీటు ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే తనకు కేటాయించిన సీటు మరో దారిలో ఉంది.. దీంతో తన సీటు వద్దకు వెళ్లేందుకు అక్కడే ఉన్న మరో ఇద్దరు వ్యక్తుల సీటు పైకి ఎక్కి.. వారిని దాటి తన సీటు వద్దకు చేరుకుంది. ఆ అమ్మాయి చేస్తున్న పనిని అక్కడే ఉన్న మరో ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. ఆమె చేసిన పనికి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువతి చేసిన పని పూర్తిగా క్రిమినల్ ఆక్టివిటి అని..ప్రయాణికులు సహకరించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్..
The most criminal activity I’ve ever seen on an airplane. This woman was hopping over other passengers the whole 7 hour flight. @PassengerShame pic.twitter.com/drET3BGBWv
— brandon? (@In_jedi) June 15, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.