చాలా మంది తమ ఆరోగ్యం కోసం జిమ్‌కి వెళుతుంటారు. జిమ్‌కి వెళ్లేందుకు చాలా మంది ప్రత్యేక దుస్తులను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇక్కడ కొందరు మహిళలు మాత్రం సంప్రదాయ చీర కట్టులోనే జిమ్‌లో వ్యాయామం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. చీర కట్టుకుని జిమ్‌కి వెళ్లలేమని, వ్యాయామం చేయలేమని కాదు. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారడంతో ప్రజల స్పందన చర్చకు దారితీసింది. వీడియోలో చీరలు ధరించిన కొందరు మహిళలు జిమ్‌లొ సీరియస్‌గా ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. ఈ మహిళలపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఈ వీడియోపై నెటిజన్లలో ఇంతపెద్ద చర్చకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మహిళలు చీర కట్టుకుని జిమ్‌కు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చీర కట్టుకుని జిమ్‌లో వ్యాయామం చేయడం కొంచెం కష్టమే. చీర కట్టుకుని జిమ్ పరికరాలను ఉపయోగించడం అంత సులభం కాదు. అయితే జాగ్రత్తలు తీసుకుంటే వ్యాయామం అసాధ్యం కాదు. అలాంటిది ఈ మహిళలు వ్యాయామం చేయడానికి కంటే వీడియోలు చేయడానికి చీర కట్టుకుని జిమ్‌కి వచ్చారని ఇక్కడ కొంతమంది నెటిజన్లు అంటున్నారు.
జిమ్‌కి వచ్చే సమయంలో మహిళలు బ్లౌజ్‌లు ఎందుకు ఎందుకు సరిగా ధరించలేదంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి స్టంట్స్ అన్ని రీల్స్, వ్యూస్ కోసమే అంటున్నారు మరికొందరు నెటిజన్లు. పబ్లిసిటీ కోసమే అయినా అందులో తప్పేముంది అంటున్నారు మరికొందరు. ఇకపోతే, జిమ్‌లో ప్రతి ఒక్కరూ తమ వ్యాయామం, ఆరోగ్యం, శరీరంపై దృష్టి పెట్టాలని కొందరు అంటున్నారు. మీరు ఇతరులపై శ్రద్ధ చూపడం మానేస్తే, ప్రతిదీ చక్కగా ఉంటుంది. ఈ వీడియోపై రకరకాల రియాక్షన్‌లు వస్తూ వేగంగా వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూడండి..
कितनी संस्कारी महिला है, जिम मे भी साडी पहन के गई है…
लेकिन जल्दबाजी मे ब्लाउज पहनना भूल गई।
😜😜😜😜😜😜😜😜 pic.twitter.com/kOlBknuXk9— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) August 29, 2024
రోజూ జిమ్‌కి వెళ్లే ఈ మహిళలు వీడియో కోసం చీర కట్టుకుని కసరత్తు చేస్తున్నారు. మహిళలు చీర కట్టుకుని జిమ్ చేస్తున్న వీడియోలు చాలా వైరల్ అవడానికి కారణం ఇదే. ఇదిలా ఉంటే, ఈ వీడియో ప్రజలలో ఉత్సుకత, చర్చనీయాంశంగా మిగిలిపోయింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.2 మిలియన్ సార్లు వీక్షించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..