
కొన్ని వీడియోలను చూస్తే ఒక్కోసారి షాక్ అవుతుంటాం. అసలు అలా ఎలా అని ఆశ్చర్యపోతాం. కొంత మంది అలాంటి విచిత్ర పనులు చేస్తుంటారు. ప్రతీ రోజు సోషల్ మీడియాలో అలాంటి చాలా వీడియోలు కనిపిస్తుంటాయి. తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మహిళ చేసిన పనికి అంతా షాకవుతున్నారు. అసలు ఆ మహిళ ఏం చేసిందంటే.. అపార్ట్ మెంట్ లోని తన ఫ్లాట్ బాల్కనీలో గార్డెనింగ్ చేస్తూ మహిళ కనిపించింది. అయితే ఏమైంది అంటారా..? సదరు మహిళ బాల్కనీ గోడపైకి ఎక్కి ఈ పని చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటే ఆ ఫ్లాట్ కొన్ని ఫ్లోర్లపై ఉంది. అయినా సరే సదరు మహిళ ఎటువంటి భయం లేకుండా గోడపైకి ఎక్కి గార్డెనింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ ఆమె మహిళ ఏదైనా చేయగలదు అని కామెంట్ చేస్తే.. మరొకరు ఆమెను ముందు గార్డెనింగ్ చేసుకోనివ్వండి అని కామెంట్ చేశారు. గార్డెన్ పని చేయడానికి అదే సరైన ప్రదేశం అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. ఏదిఏమైన ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
पहले gardening कर लेती हूँ
😧😧😧😨😨 pic.twitter.com/MWDVTe5df0— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) July 2, 2025