సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి చిన్న విషయం వైరల్ అవుతుంది. ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో లోకం మొత్తం తెలిసిపోతుంది. దేశ విదేశాల్లో ఏ ఇంట్లో జరిగిన ఫన్నీ విషయాలు.. భయపెట్టే సంఘటనలు వింటున్నాం. అలాగే కొన్నిసార్లు నమ్మశఖ్యం కానీ విషయాల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అలాంటి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. జనాలకు నమ్మశక్యం కానీ విషయం.. కానీ పక్కా ఆధారాలతో ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అసలు విషయానికి వస్తే.. సాధారణంగా ఓ ఆహార పదార్థమైన ఒక్క రోజు లేదా రెండు మూడు రోజులు ఉంటుంది. అదే పది రోజులు దాటితే కచ్చితంగా ఆ ఆహారం పాడైపోతుంది. కానీ ఓ బర్గర్ మాత్రం ఏకంగా 5 సంవత్సరాలు తాజాగా ఉంది. ఇది నిజమే. అసలు ఈ మ్యాటర్ ఎక్కడ జరిగింది..? ఎప్పుడు జరిగింది ? అనే విషయాలు తెలుసుకుందాం.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఓ మహిళ తన కబోర్డ్ నుంచి 5 సంవత్సరాల తర్వాత మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ను బయటకు తీసింది. ఐదేళ్ల తర్వాత కూడా ఆ బర్గర్ పాడవలేదు. కుళ్లిపోలేదు. అంతేకాకుండా ఏమాత్రం రంగు కూడా మారలేదు. క్రిస్మస్ కోసం కబోర్డ్ శుభ్రం చేస్తుండగా ఓ బాక్స్ దొరికిందని.. అది బర్గర్లు దాచే మెగాన్ కాండ్రీ అని తెలిసింది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో బర్గర్ కనిపించింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆ మహిళ దాచిన మెగాన్ చీజ్ బర్గర్ అని తెలిసింది. అది చాలా తొందరగా పాడుతుంది. కానీ ఆ బర్గర్ మాత్రం 5 సంవత్సరాలు కబోర్డ్ లో ఉండిపోయింది.
ఎలాంటి వాసన లేదు.. కొన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉండిపోయిందని సదరు మహిళ తెలిపింది. ఆమె 2017లో ఆ బర్గర్ కొనుగోలు చేసినట్లు ఆ ప్యాకెట్ మీద కనిపించింది. ఇక ఆ ప్యాకెట్ ను ఆమె 2022లో ఓపెన్ చేసింది. మెక్‌డొనాల్డ్స్ IFL సైన్స్ నివేదికలో వెల్లడించిన సమాచారం ప్రకారం ఐదేళ్ల తర్వాత ఆ బర్గర్ తేమ పూర్తిగా లేదు. అందుకే ముందులా ఉందని చెప్పేలమని తెలిపారు. ఈ కంపెనీ బర్గర్స్ ఫ్రిజర్వేటివ్ లు ఉపయోగించరు. అందుకే అవి సన్నగా ఉంటాయి. వాటిని వేడి చేస్తే తేమను కోల్పోవడం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత ఎండిపోతాయి. ఆ బర్గర్లను ఎక్కువ సేపు ఎక్కడైన ఉంచితే అవి పూర్తిగా తేమను కోల్పోతాయి. దాంతో గట్టిగా రాయిలా మారడం ప్రారంభమవుతుంది. బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇందులో పెరగాలంటే తేమ అవసరం. కానీ తేమ ఆరిపోయిన తర్వాత బ్యాక్టీరియా, ఫంగస్ పెరగవు. అందుకే ఆ బర్గర్ పాడవకుండా ఉన్నట్లు తెలుస్తోంది.