Viral Video: కరోనా వ్యాక్సీన్‌ కోసం క్యూలో నిల్చున్న మహిళలు.. అంతలో ఊహించని సీన్.. వైరల్ అవుతున్న వీడియో..

|

Jul 24, 2021 | 12:41 PM

Viral Video: మహిళలకు ఆగ్రహం వస్తే.. మామూలుగా ఉండదు. ప్రత్యర్థులకు చుక్కలే. ఆ ప్రాంతం అంతా రచ్చ రచ్చే అవుతుంది.

Viral Video: కరోనా వ్యాక్సీన్‌ కోసం క్యూలో నిల్చున్న మహిళలు.. అంతలో ఊహించని సీన్.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video
Follow us on

Viral Video: మహిళలకు ఆగ్రహం వస్తే.. మామూలుగా ఉండదు. ప్రత్యర్థులకు చుక్కలే. ఆ ప్రాంతం అంతా రచ్చ రచ్చే అవుతుంది. సాధారణంగా గ్రామాల్లో, పట్టణాల్లో నీటి ఎద్దడి ఉన్న చోట మహిళలు పోట్లాడుకునే దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ తరువాత ఇరుగు పొరుగు వారితో పోట్లాటలు చూస్తుంటాం. మహిళల ఘర్షణలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా వ్యాక్సీన్ సెంటర్ వద్ద కొందరు మహిళలు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. జుట్లు లాక్కుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాలో గల టీకా కేంద్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఖార్గాన్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సీనేషన్ సెంటర్ వద్దకు జనాలు భారీ సంఖ్యలో వచ్చారు. కరోనా టీకా వేయించుకకునేందుకు వ్యాక్సీనేషన్ సెంటర్ వద్ద బారులు తీరారు. మహిళలు ఒకవైపు, పురుషులు ఒక వైపు క్యూ లైన్లలో నిల్చుని ఉన్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ.. కొందరు ఆడవాళ్లు బాహాబాహీకి దిగారు. జట్లు పట్టుకుని పిడి గుద్దులు గుద్దుకున్నారు. మొదట ఇద్దరితో ప్రారంభమైన గొడవ.. ఆ తరువాత పది మంది వరకు కొట్టుకున్నారు. అయితే, వీరిని విడిపించేందుకు కొందరు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూనే ఉన్నారు. కాగా, వీరు కొట్టుకుంటూ ఉండగా.. కొందరు వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అదికాస్తా వైరల్‌గా మారింది.

కరోనా మహమ్మారి ప్రజలను ఎంతగా భయపెట్టిందో తెలిసిందే. కరోనా దెబ్బకు ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. అందుకే కరోనాను ఎదుర్కొనేందుకు త్వరగా టీకా వేయించుకోవాలని ఆరాటపడుతున్నారు. దేశంలో కరోనా వ్యాక్సీన్ ప్రక్రియ మొదలైన సమయంలో ప్రజలెవరూ కరోనా టీకా తీసుకునేందుకు ముందుకు రాలేదు. కానీ కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభించడంతో చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు టీకా ఒక్కటే మార్గమని, వ్యాక్సీనేషన్ ప్రక్రియను ఉధృతం చేసింది కేంద్ర ప్రభుతవం. ప్రజల్లో కూడా టీకా పట్ల సానుకూలత ఏర్పడింది. టీకా వేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు తరలి వచ్చారు. ఇప్పటికీ టీకా కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.

Viral Video:

Also read:

YS Vivekananda Reddy: వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. తనను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టులో దాఖలు చేసిన..

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. 79 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

AP Inter Results: ఇంటర్మీడియట్ ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నారా?.. అయితే అందుకు సిద్ధమవండి..