Viral Video: కచ్చాబాదం పాటకు నాగిన్‌ డ్యాన్స్‌.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో.. చూస్తే మీరూ ఎంజాయ్‌ చేస్తారు..

| Edited By: Ravi Kiran

Apr 18, 2022 | 9:47 AM

Kacha Badam Song: క‌చ్చాబాదాం పాట‌ సోషల్‌ మీడియాలో ఎంత ఫేమ‌స్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పశ్చిమ బెంగాల్‌లోని భీర్బూమ్‌కి చెందిన భూబన్‌ అనే ఓ పల్లీల వ్యాపారి సరదాగా పాడిన ఈ పాట సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది.

Viral Video: కచ్చాబాదం పాటకు నాగిన్‌ డ్యాన్స్‌.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో.. చూస్తే మీరూ ఎంజాయ్‌ చేస్తారు..
Follow us on

Kacha Badam Song: క‌చ్చాబాదాం పాట‌ సోషల్‌ మీడియాలో ఎంత ఫేమ‌స్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పశ్చిమ బెంగాల్‌లోని భీర్బూమ్‌కి చెందిన భూబన్‌ అనే ఓ పల్లీల వ్యాపారి సరదాగా పాడిన ఈ పాట సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఈ పాటలో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయాడు భూబన్‌. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌.. ఎక్కడ చూసినా ఈ పాటే దర్శనమిచ్చింది. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఈ పాటను తెగ ఎంజాయ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలు సైతంఈ పాటకు ఫిదా అయ్యి తమ స్టైల్లో స్టె్ప్పులేస్తున్నారు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇక ఈ ట్రెండీ సాంగ్‌కు రీక్రియేషన్లు, స్ఫూప్‌ వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్‌ గా మారాయి. ఇదిలా ఉంటే ఓ మహిళ ఈ పాటకు నాగిన్‌ డ్యాన్స్‌ (Naagin Dance) వేసి అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

‘బ‌ట‌ర్ ఫ్లై’ అనే యూజ‌ర్ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇందులో నీలిరంగు చీర‌ ధరించిన మహిళ నాగిని స్టెప్పులేసి అల‌రించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో కచ్చా బాదం సాంగ్‌ ప్లే అవుతుండగా అచ్చం పాములా నాలుక, చేతులు కదుపుతూ డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ ను చూసి పక్కనున్నవారు బాగా నవ్వుతూ ఎంజాయ్‌ చేయడం వీడియోలో మనం చూడవచ్చు. ఓపెళ్లి బ‌రాత్‌లో దీనిని షూట్‌ చేసినట్లు తెలుస్తోంది. కాగా నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు బాగా నవ్వుకుంటున్నారు. ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Also Read:Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న స్కార్పియో.. నలుగురి మృతి..

R Madhavan: పుత్రోత్సాహంలో నటుడు మాధవన్.. స్విమ్మింగ్‌లో సిల్వర్ గెలుచుకున్న కొడుకు.. శుభాకాంక్షలు వెల్లువ

Multibagger Stock: రెండేళ్ల కాలంలో లక్షను.. 90 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్..