Viral Video: మహిళ దేశీ జుగాద్‌ను చూసి జనం షాక్ .. నాసా వారు నీకోసం దీపంతో వెదుకుతున్నారని కితాబు

|

Jul 06, 2023 | 2:33 PM

వైరల్ వీడియో క్లిప్‌లో ఒక మహిళ దుప్పటిని ఉతికిన తర్వాత ప్యాక్ చేస్తోంది. ఆమె బ్లాక్ కలర్ పాలిథిన్‌లో దుప్పటిని ఉంచినప్పుడు దాని పరిమాణం చాలా పెద్దదిగా కనిపించడం వీడియోలో చూడవచ్చు. అయితే ఆ తర్వాత ఈ మహిళ తన తెలివి తేటలకు పదుని పెట్టి దేశీ జుగాడ్ చేసింది. దీంతో దుప్పటి ప్యాకెట్ చాలా చిన్న సైజుకి కుదించుకుపోయింది.

Viral Video: మహిళ దేశీ జుగాద్‌ను చూసి జనం షాక్ .. నాసా వారు నీకోసం దీపంతో వెదుకుతున్నారని కితాబు
Viral Video
Follow us on

వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తూ రుతుపవనాలు అడుగు పెట్టాయి. వానలతో వనం పచ్చదనాన్ని సంతరించుకుని ప్రకృతి ప్రేమికులను పులకరింపజేస్తున్నాయి. ముఖ్యంగా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఉన్ని బట్టలు ప్యాక్ చేయడం పెద్ద తలనొప్పి. మొదట.. అవి భారీగా ఉంటాయి. అదే సమయంలో దుస్తులు బ్యాగ్  మొత్తం స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ దేశీ ట్రిక్‌ని ఉపయోగించి చిన్న స్థలంలో ప్యాక్ చేసి చూపరులను సైతం ఉలిక్కిపడేలా చేసింది. మేడమ్.. నాసా వాళ్ళు మీకోసం దీపం పెట్టి వెతుకుతున్నారు అంటూ ఇప్పుడు నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ వీడియో క్లిప్‌లో ఒక మహిళ దుప్పటిని ఉతికిన తర్వాత ప్యాక్ చేస్తోంది. ఆమె బ్లాక్ కలర్ పాలిథిన్‌లో దుప్పటిని ఉంచినప్పుడు దాని పరిమాణం చాలా పెద్దదిగా కనిపించడం వీడియోలో చూడవచ్చు. అయితే ఆ తర్వాత ఈ మహిళ తన తెలివి తేటలకు పదుని పెట్టి దేశీ జుగాడ్ చేసింది. దీంతో దుప్పటి ప్యాకెట్ చాలా చిన్న సైజుకి కుదించుకుపోయింది. పాలిథిన్ నుండి గాలిని తొలగించడానికి మహిళ వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించడం వీడియోలో మీరు చూడవచ్చు. అప్పుడు తక్కువ సమయంలో ప్లాస్టిక్ బ్యాగ్ చాలా చిన్నదిగా మారుతుంది. అద్భుతమైన జుగాద్ కదా అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

దేశీ జుగాద్ ఈ అద్భుతమైన వీడియో @TopTaIents హ్యాండిల్‌తో ట్విట్టర్‌లో షేర్ చేశారు. మేడమ్ జీ… NASA కి చెందినవారు మీ కోసం వెతుకుతున్నారు అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. 40 సెకన్ల క్లిప్‌కి ఇప్పటివరకు 90 వేలకు వ్యూస్ లభించాయి. అంతేకాదు తెగ షేర్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఒక వినియోగదారు వ్రాశారు.. ఇది నిజంగా అద్భుతమైన జుగాద్. నేను కూడా ప్రయత్నించాలనుకుంటున్నాను. అదే సమయంలో, మరొకరు స్త్రీ ఆలోచనకు వందనం. ఈ ట్రిక్‌తో ఎవరైనా బ్యాగ్ లో స్థలాన్ని ఆదా చేయవచ్చు అని మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..