డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. రెచ్చిపోయిన నెటిజన్లు.. రియాక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే..

|

Sep 27, 2024 | 1:12 PM

స్కూల్స్‌, కాలేజీలు పలు ఈవెంట్‌ల సందర్భంగా ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు వంటివి సర్వసాధారణం. పలు కంపెనీలు సైతం ఉద్యోగుల ఒత్తిడిని దూరం చేసేందుకు వార్షిక ఈవెంట్‌లు, పార్టీలు, ఇలాంటి డ్యాన్స్‌ పోటీలు నిర్వహిస్తుంటాయి. అయితే, అలాంటిదే మెడికల్ కాన్ఫరెన్స్‌లో భాగంగా డాక్టర్లు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రజలు ఇష్టపడలేకపోతున్నారు.

డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. రెచ్చిపోయిన నెటిజన్లు.. రియాక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే..
Medical Conference
Follow us on

సోషల్ మీడియాలో రోజుకో వీడియో వైరల్ అవుతోంది. ఇలాంటి వీడియోలు కొన్ని జనాలు అస్సలు ఇష్టపడరు.. నచ్చని వీడియోలు చూసిన నెటిజన్లు వెంటనే తీవ్రమైన రియాక్షన్స్‌ ఇస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చెన్నైలోని మెడికల్ కాన్ఫరెన్స్‌కు సంబంధించినదిగా తెలిసింది. మెడికల్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డాక్టర్లు అంతా కలిసి పార్టీ చేసుకున్నట్టుగా వీడియో చూస్తే అర్థమవుతోంది.. ఈ పార్టీలో ఒక మహిళా డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇదే ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెలితే..

స్కూల్స్‌, కాలేజీలు పలు ఈవెంట్‌ల సందర్భంగా ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు వంటివి సర్వసాధారణం. పలు కంపెనీలు సైతం ఉద్యోగుల ఒత్తిడిని దూరం చేసేందుకు వార్షిక ఈవెంట్‌లు, పార్టీలు, ఇలాంటి డ్యాన్స్‌ పోటీలు నిర్వహిస్తుంటాయి. అయితే, అలాంటిదే మెడికల్ కాన్ఫరెన్స్‌లో భాగంగా డాక్టర్లు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రజలు ఇష్టపడలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

చెన్నైలోని ఇండియన్ కోలన్, రెక్టల్ సర్జన్ల 47వ వార్షిక సదస్సు సందర్బంగా ఓ డాన్సర్‌తో ప్రొగ్రామ్‌ చేర్పాటు చేశారు. ఆమె ధరించిన బట్టలు అసభ్యకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. పైగా ఆ లేడీ డ్యాన్సర్‌ మగవాళ్లతో కలిసి స్టెప్పులేయటం కూడా చాలా మందికి నచ్చటం లేదు. డాక్టర్ల కాన్ఫరెన్స్‌లో జరిగిన డ్యాన్స్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. వైద్య సదస్సులో ఇలాంటి కార్యక్రమాలేంటి అంటూ ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా కొందరు కోరారు.

అయితే, నిత్యం రోగుల మధ్యలోనే ఉంటూ ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు వైద్యులు. ఎన్నో రకాల రోగాలు, చావులు, బంధువుల రోదనలు వింటూ మనోవేదనను మనసులోనే దాచుకునే డాక్టర్లకు ప్రశాంతత,  పని ఒత్తిడి నుంచి ఊరట కలిగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైనే ఉందని మరికొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  కాకపోతే, వైద్యుల సదస్సులో ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారనే దానిపై అధికారిక ప్రకటన లేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..