Watch Video: ఇది కదా సాహసం అంటే.. ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది.. షాకింగ్ వీడియో..
Woman constable saves passenger: కదులుతున్న రైలు ఎక్కడం.. దానిలో నుంచి దిగడం లాంటివి చేయోద్దంటూ పదే పదే చెబుతుంటారు అధికారులు. కానీ కొందరు అవేమీ పట్టించుకోకుండా

Woman constable saves passenger: కదులుతున్న రైలు ఎక్కడం.. దానిలో నుంచి దిగడం లాంటివి చేయోద్దంటూ పదే పదే చెబుతుంటారు అధికారులు. కానీ కొందరు అవేమీ పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతుండగా.. కొందరు తృటిలో బయటపడుతుంటారు. తాజాగా రైలు నుంచి కిందపడిన ప్రయాణికురాలి ప్రాణాలను మహిళా కానిస్టేబుల్ కాపాడింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. కదులుతున్న రైలు – ప్లాట్‌ఫారమ్ మధ్య గ్యాప్‌లో ఇరుక్కుపోయిన ఒక మహిళా ప్రయాణికురాలిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ రక్షించింది. ఈ సంఘటన సాయంత్రం 6:26 గంటలకు జరిగిందని అధికారులు తెలిపారు.
చక్రధర్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ (18012) ప్లాట్‌ఫారమ్ నంబర్ 3 నుంచి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మహిళ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ క్రమంలో రైలు – ప్లాట్‌ఫారమ్ మధ్య గ్యాప్‌లో చిక్కుకుంది. ఈ క్రమంలో ప్లాట్‌ఫారమ్‌పై అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వహీదా ఖాతూన్ వెంటనే పరుగెత్తి ఆమెను పట్టుకొని పైకి లాగింది. వెంటనే కానిస్టేబుల్ స్పందించడంతో ప్రయాణికురాలు క్షేమంగా బయటపడిందని అధికారులు తెలిపారు.
వీడియో..
Being a hero is a choice for some !#RPF Const. Wahida Khatun displayed heroic #LifeSavingAct by pulling out a lady who got stuck in the gap between moving train & platform at Chakradharpur Station.#MissionJeewanRaksha#NariShakti#HeroesInUniform@RailMinIndia @AshwiniVaishnaw pic.twitter.com/nUvOzD9hsw
— RPF INDIA (@RPF_INDIA) March 25, 2022
ఈ మేరకు ఆర్పీఎఫ్ ఇండియా ట్విట్ చేసి వెల్లడించింది. సకాలంలో స్పందించిన కానిస్టేబుల్ ను రైల్వే అధికారులు అభినందించారు.
Also Read: