Trending: విధి ఎలా రాసి పెట్టి ఉంటే జీవితం అలా ముందుకు వెళ్తుంది. పుట్టుకను, చావును మనం నిర్ణయించలేం. రాసిపెట్టి లేకపోతే.. చనిపోదామనుకున్నా కూడా అది జరగదు. తాజాగా కేరళ(Kerala)లో ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను ఊహించని రీతిలో తేనెటీగలు కాపాడాయి. ఇది వింటుంటే..ఇదేలా సాధ్యం అనే సందేహం మీకూ కలుగుతుంది కదూ..! కానీ, ఇది నిజమేనండోయ్..కేరళలోని అలప్పుజలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె ఎక్కిన సెల్ టవర్ పైనే పెద్ద తేనెతుట్టే ఒకటి ఉంది. మహిళ సెల్‌టవర్ ఎక్కుతుండగా తేనెతుట్టె కదిలింది. వెంటనే తేనెటీగలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి. మహిళపై దాడి చేశాయి. తేనెటీగల భయంతో గబగబ కిందకు దూకేసింది. అప్పటికే ఆమెను కాపాడేందుకు స్థానికులు, ఫైర్ సిబ్బంది కింద చీరలతో వలల మాదిరిగా ఏర్పాటు చేవారు. ఆమె అదృష్టం బాగుండి చీరల మీద పడింది. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా మద్యానికి బానిసైన సదరు మహిళ భర్తకు దూరంగా ఉంటుంది. అయితే భర్త.. మూడున్నరేళ్ల పాపను తన వద్దే ఉంచుకోవడంతో… ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.