భార్యపై అతడికి ఎనలేని ప్రేమ. ఆమె కలలను తనవిగా భావించాడు. రాత్రింబవళ్ళు కష్టపడి ఒక్కో రూపాయి కూడబెట్టి తన భార్యను చదివించాడు. ఆమె కూడా బాగా చదువుకుంది. కట్ చేస్తే.. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా ఉద్యోగాన్ని సంపాదించింది. అనంతరం తనకు పొగరు వచ్చింది. తనదే పెద్ద ఉద్యోగం అనుకుని భర్తను చులకనగా చూడటం మొదలుపెట్టింది. అంతేకాదు.. వేరే అధికారితో వివాహేతర సంబంధం కూడా పెట్టుకుంది. ఇదేంటని నిలదీసిన భర్తపై వరకట్నం కేసు పెట్టి జైలులో ఊసలు లెక్కపెట్టేలా చేసింది. కొద్దిరోజుల తర్వాత బెయిల్‌పై బయటకొచ్చాడు. అటు ఉద్యోగం, ఇటు పరువు.. రెండూ పోయాయి. చివరికి ఆ భర్త.. నడిరోడ్డు మీదకు వచ్చి.. భార్యపై న్యాయపోరాటానికి దిగాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అలోక్ మౌర్య అనే వ్యక్తి తన భార్య జ్యోతి కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. వచ్చిన ప్రతీ రూపాయి కూడబెట్టాడు, పైగా కొంత అప్పు కూడా చేశాడు. ఇలా ఓ కోచింగ్ సెంటర్‌లో చేర్పించి తన భార్యను చదివించాడు. చివరికి ఆమె కూడా ఆ పరీక్షలో పాస్ అయ్యి.. సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ పోస్టు సాధించింది. కట్ చేస్తే.. తన భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందన్న అతడి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఆమె ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. భర్తపై చులకన భావం పెరిగింది. అంతేకాదు.. ఏకంగా మరో అఫీసర్‌తో వివాహేతర సంబంధాన్ని కూడా పెట్టుకుంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకుని అలోక్ తన భార్యను నిలదీయగా.. అతడిపై వరకట్నం కేసు పెట్టి జైలుపాలు చేసింది జ్యోతి. అనంతరం కొద్దిరోజులకు బెయిల్‌పై బయటకొచ్చాడు అలోక్. తన పరువుతో పాటు ఉద్యోగం కూడా పోయిందని మీడియా ముందు వాపోయాడు. విడాకులు ఇవ్వాలంటూ జ్యోతి తనను వేధింపులకు గురి చేస్తోందని, ఆమె ఫిర్యాదు చేసినా.. ఎవరూ తన గోడు పట్టించుకోవట్లేదని కన్నీరు మున్నీరు అవుతున్నాడు అలోక్.
पति ने बीवी को पढ़ा-लिखाकर बनाया SDM,मैडम ने होमगार्ड कमांडेंट से चलाया अफेयर, हस्बैंड ने दिखाए सबूत
Story- @varnitavajpayee pic.twitter.com/O5i7BwNIoL— CrimeTak.in (@CrimeTakBrand) June 22, 2023