Viral Video: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నో( Lucknow ) లోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం ( Charabagh Railway Station) పై పోలీసులకు, కొంతమందికి మధ్య జరిగిన గొడవ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతోంది. అందిన సమాచారం ప్రకారం.. ప్లాట్‌ఫారమ్‌పై బట్టలు, వస్తువుల విషయంపై వాగ్వాదం జరిగిందని.. ఈ వివాదం ఘర్షణకు దారితీసిందని తెలుస్తోంది. ఈ వీడియోలో లక్నో పోలీస్ కమిషనరేట్‌లోని ఓ కానిస్టేబుల్ మహిళను కొడుతుండడం.. ఆ మహిళ కూడా పోలీసును చెప్పుతో కొడుతున్నది కనిపిస్తోంది.
चारबाग रेलवे स्टेशन पर नशे में धुत #UPPolice के सिपाही का #Video वायरल@upgrp_hq @rpolucknow @Uppolice pic.twitter.com/ZLq1BqRyiu
— PoliceMediaNews (@policemedianews) March 17, 2022
పోలీస్ కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్నాడని, తన వస్తువులను తీసుకుని వెళ్లాలని ఓ వ్యక్తిని కోరగా.. ఆ వ్యక్తి పోలీసు చెప్పిన దానికి నిరాకరించడంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారని తెలుస్తోంది. . అదే సమయంలో ఓ మహిళ కూడా కలగజేసుకుంది. పోలీసు ఆ మహిళను గెంటేయడంతో ఆ మహిళ పోలీసును చెప్పుతో కొట్టింది. రక్షణ కోసం RPF మహిళా పోలీసు కూడా జోక్యం చేసుకుంది. ఈ వివాదం చార్‌బాగ్ GRP పోలీసులకు చేరింది. ఇరువర్గాలను వెంటనే జిఆర్‌పి పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. అయితే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారని.. దీంతో ఈ వివాదంపై ఎటువంటి కేసు నమోదు కాలేదన్నారు.