అరుదైన ఘటన.. కవలలకు జన్మనిచ్చిన బ్లడ్‌ క్యాన్సర్‌ బాధితురాలు.. డాక్టర్లు ఏం చేశారంటే..

|

Sep 11, 2024 | 6:24 PM

చివరకు ఆ మహిళ నార్మల్ డెలీవరి ద్వారా కవలలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో ఒక ఆడపిల్ల, ఒక మగబిడ్డ పుట్టారు.  తల్లి, పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మహిళకు ఇదే తొలి ప్రసవం కావడం, కవలలు పుట్టడం ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపింది.

అరుదైన ఘటన.. కవలలకు జన్మనిచ్చిన బ్లడ్‌ క్యాన్సర్‌ బాధితురాలు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Twin Babies
Follow us on

బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 22 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఈ కేసును వైద్యులు అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించారు. ఇలాంటి అరుదైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగుచూసింది. ఇండోర్‌లోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి క్లినికల్ హెమటాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అక్షయ్ లహోటి బృందం ఆ మహిళకు డెలీవరి చేసింది. ఆ మహిళ చాలా కాలంగా మైలోయిడ్ లుకేమియా అనే ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతోందని, అటువంటి పరిస్థితిలో ఆమెకు సురక్షితంగా డెలివరీ చేయడం తమకు పెద్ద సవాలుగా మారిందని వివరించారు.

ఈ మేరకు డాక్టర్ అక్షయ్ లహోటి మాట్లాడుతూ..- సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నగరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్ పరిధిలోకి వస్తుంది. ఆ మహిళ గర్భం దాల్చిన తర్వాత ఈ ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య సాధారణం కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. దీంతో ఆమె గర్భవతి కావడంతో ఆమెకు సాధారణ క్యాన్సర్ మందులు, కీమోథెరపీని ఇవ్వలేకపోయామని చెప్పారు. కాబట్టి, మన దేశంలోనే కాదు విదేశాలలో ఉన్న నిపుణులను సంప్రదించి ఆమెకు, ఆమె కడుపులో ఉన్న కవలలకు ఎటువంటి హాని జరగకుండా చూసేందుకు ప్రత్యేక మెడిసిన్‌ ఇవ్వడం ప్రారంభించామని చెప్పారు.

అయితే, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సదరు మహిళకు బ్లడ్ క్యాన్సర్ ఉందని ఆమెతో చెప్పలేదట. ఎందుకంటే గర్భధారణ సమయంలో ఆమె మానసికంగా ధైర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని భావించి ఆమెకు జాగ్రత్తగా వైద్యం అందించామని చెప్పారు. చివరకు ఆ మహిళ నార్మల్ డెలీవరి ద్వారా కవలలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో ఒక ఆడపిల్ల, ఒక మగబిడ్డ పుట్టారు.  తల్లి, పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మహిళకు ఇదే తొలి ప్రసవం కావడం, కవలలు పుట్టడం ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపింది.

ఇవి కూడా చదవండి

ఆసుపత్రి వైద్యులు తెలిపిన ప్రకారం, దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియాతో బాధపడుతున్న మహిళకు సురక్షితమైన ప్రసవం జరిగినట్లు ప్రపంచంలో ఎక్కడా వినలేదని చెప్పారు. వైద్య చరిత్రలో ఇదోక అరుదైన, చారిత్రక ఘట్టంగా వైద్యులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..