పిల్లి కోసం ప్రాణాలకు తెగించింది ఓ మహిళ. తాడుకట్టుకుని పాడుబడ్డ బావిలోకి దిగి ఓ చిన్ని ప్రాణాన్ని రక్షించింది. చూడ్డానికే ఒళ్లు గగుర్పొడిచే ఆ దృశ్యం మీరూ ఓసారి చూడండి. బావి పూర్తిగా పాడుబడి ఉంది. అందులో నీళ్లు కాదు.. చెట్లూ చేమ, పొదలు పెరిగి ఉన్నాయి. పై నుంచి భర్త తాడు పట్టుకుని సాయం చేస్తే ఆమె సాహసోపేతంగా అందులో దిగి పిల్లిని ఓ సంచిలో వేసి పైకి తీసుకొచ్చింది. కర్నాటకలోని మంగళూరులో జరిగింది ఈ ఘటన. జేపు సమీపంలో ఇళ్ల మధ్యలో ఉన్న 200 అడుగుల లోతు బావి ఇది. ఎలా పడింది గానీ ఓ పిల్లి పిల్ల అందులో పడిపోయింది. అది గమనించిన రజనీ దామోదర్‌శెట్టి అనే మహిళ తాడు సాయంతో బావిలోకి దిగింది. ఎట్టకేలకు పిల్లిని సేఫ్‌గా పైకి తీసుకొచ్చింది. మహిళ సాహసాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
యుద్ధవిద్యల్లో పిల్లిని మించిన జంతువు లేదంటారు జపాన్ వాసులు. ఇక వేగంగా దాడి చేయడంలో పాముకు మించినది లేదు. ఈ రెండు ఎదురెదురు పడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా.. ఇటీవల అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.
— إفتراس | prey (@iftirass) July 1, 2021
Also Read: స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం.. కోలాహలంగా ఆదివాసి సంబరం
Dalitha Bandhu: రూ.500 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు