Optical Illusion: ఈ ఫోటోలోని చిరుత మీకు కనిపించిందా.? జస్ట్ 13 సెకన్లు..
ఈ రోజుల్లో, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ కష్టమైన ఫోటో పజిల్స్‌ను..

ఈ రోజుల్లో, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ కష్టమైన ఫోటో పజిల్స్‌ను సాల్వ్ చేయలేక నెటిజన్లు బుర్రలు పట్టుకుంటున్నారు. ఏదైనా మాంచి ఫోటో పజిల్ దొరికినట్లయితే.. అది కాసేపు మన మెదడుకు పని చెబుతుంది. కళ్లకు పదును పెడుతుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎప్పటికప్పుడు నెటిజన్లను తికమక పెట్టేస్తుంటాయి. మీ మెదడు సామర్ధ్యానికి పరీక్ష పెడుతుంటాయి. ఫోటో పజిల్స్, బ్రెయిన్ టీజర్స్, ఫోటో ఇల్యూషన్స్ లాంటివి ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం.
పైన పేర్కొన్న ఫోటోను మీరు చూసినట్లయితే.. అదొక పర్వత ప్రాంతం అని చెప్పొచ్చు. ఓ కొండ.. చుట్టూ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అయితే అక్కడే ఒక చోట ఓ చిరుత దాగుంది. దాన్ని మీరు కనిపెట్టాలి. మీ కళ్లకు పవర్ ఎక్కువగా ఉంటే.. కేవలం 13 సెకన్లలో పజిల్ సాల్వ్ చేయండి. లేదంటే ఇక అంతే!. ఫోటోను పైపైన చూస్తే మాత్రం మీకేం కనిపించదు. తీక్షణంగా చూస్తేనే చిరుతను కనిపెట్టగలం. మరి లేట్ ఎందుకు మీ బుర్రకు కాస్త పని చెప్పి.. ఆన్సర్ కనిపెట్టండి. ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే కింద ఫోటో చూడండి.
here is the answer pic.twitter.com/geyDIkZfFg
— telugufunworld (@telugufunworld) December 27, 2022