సింహం సింగిల్‌గా ఎటాక్ చేస్తే.. దానిని తప్పించుకోవడం అసాధ్యం. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఇక్కడ ఒకటి కాదు.. ఏకంగా మూడు సింహాలు ఓ అడవి దున్నపై దాడి చేశాయి. ఆ దున్న భయపడలేదు.. ఎదురొడ్డి పోరాడింది. సింగిల్‌గా ఆ సింహాలకు ధీటైన జవాబిచ్చింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అడవిదున్న.. మూడు సింహాల మధ్య ఇరుక్కుపోయినట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఏం జరిగిందో తెలియదు గానీ.. అనూహ్యంగా ఆ అడవిదున్న గుంపు నుంచి తప్పిపోయింది. ఇంకేముంది ఎరను వేటాదేందుకు మూడు సింహాలు దండయాత్ర చేశాయి. అయితే ఆ అడవిదున్న సింహాలను చూసి బెదరలేదు. ధీటుగా ఆ గుంపుకు ఎదురెళ్లింది. వాటికి ఛాన్స్ ఇవ్వకుండా పోరాడింది. ఈలోపు ఇంకొన్ని అడవి దున్నలు తమ మిత్రుడిని కాపాడుకోవడానికి అక్కడికి చేరుకున్నాయి. మిషన్‌ను విజయవంతం చేశాయి. ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.
ఇది చదవండి: ఇంటికి రిపేర్ చేస్తుండగా కార్పెట్ కింద ఏదో ఉందని అనుమానం.. ఏంటా అని చూడగా.!
🦁VS🐃 pic.twitter.com/osLCMZaR4l
— existing in nature (@afaf66551) June 27, 2021
ఇది చదవండి: దమ్మున్న పజిల్.! మీ వైపే చూస్తోన్న చిరుతను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరే తోపు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..