AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటిలోనే ఉంటుంది.. కానీ నోటితో ఒక్క చుక్క నీరు కూడా తాగదు..! ఈ వింత జీవి ఏంటో తెలుసా?

Interesting Science Facts: ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. కేవలం వినోదం కోసమే కాకుండా, మన మేధస్సుకు పదును పెట్టే ఇలాంటి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. నిరంతరం నేర్చుకునే అలవాటే మిమ్మల్ని అందరికంటే ముందు వరుసలో నిలబెడుతుంది.

నీటిలోనే ఉంటుంది.. కానీ నోటితో ఒక్క చుక్క నీరు కూడా తాగదు..! ఈ వింత జీవి ఏంటో తెలుసా?
Interesting Science Facts
Venkata Chari
|

Updated on: Jun 27, 2026 | 11:21 PM

Share

Interesting Science Facts: నిత్యం నీటిలోనే జీవిస్తూ, దాహం వేసినా నోటి ద్వారా ఒక్క చుక్క నీటిని కూడా తాగని ఒక వింత జీవి ప్రకృతిలో ఉందనే విషయం మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులతో పాటు ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన సాధారణ జ్ఞాన విశేషాలు మీకోసం.

ప్రకృతిలోని వింతలు.. జీవుల రహస్యాలు..

మనం నిత్యం చూసే ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో కప్పల జీవన విధానం చాలా ప్రత్యేకమైనది. కప్పలు ఎప్పుడూ నీటిలో లేదా తేమగా ఉన్న ప్రదేశాల్లోనే జీవిస్తాయి. కానీ, అవి ఇతర జంతువులలాగా నోటితో నీటిని తాగవు. వాటికి దాహం వేసినప్పుడు తమ విలక్షణమైన చర్మం ద్వారా నీటిని నేరుగా శరీరంలోకి పీల్చుకుంటాయి. ఈ ప్రక్రియ ద్వారానే అవి శరీరానికి కావలసిన తేమను పొందుతాయి. జీవశాస్త్రంలో ఇదొక అద్భుతమైన విషయమనే చెప్పాలి.

సాధారణ జ్ఞానం.. విజయానికి మార్గం..

ప్రస్తుత రోజుల్లో పాఠశాల విద్యార్థులకైనా, ఉద్యోగులకైనా సాధారణ జ్ఞానం (జనరల్ నాలెడ్జ్) ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే బలమైన కోరికతో ఉన్నవారికి ఇది ఒక నిధి లాంటిది. ఎందుకంటే ప్రస్తుత పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలే అభ్యర్థుల విజయాన్ని డిసైడ్ చేస్తున్నాయి. పుస్తకాలు, వార్తాపత్రికలు చదివే అలవాటు ఉంటే సగం విజయం సాధించినట్లే. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఇటువంటి ఆసక్తికరమైన ప్రశ్నలు ఇప్పడు తెగ వైరల్ అవుతున్నాయి.

మీకోసం కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు – సమాధానాలు..

మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి వెనుక ఉన్న వాస్తవాలను చూద్దాం:

వాహనాల కాలుష్యం: వాహనాల నుంచి వెలువడే ప్రమాదకరమైన వాయువులు ఏవి?

మోటార్ వాహనాల నుంచి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, హానికరమైన హైడ్రోకార్బన్లు విడుదలవుతాయి. ఇవే గాలి కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

డెంగ్యూ జ్వరం: ఏ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది?

డెంగ్యూ అనేది ఒక ప్రమాదకరమైన వైరస్ వల్ల వస్తుంది. ఇది ప్రధానంగా ‘ఈడిస్ ఈజిప్టి’ జాతికి చెందిన ఆడ దోమలు కుట్టడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది.

ఆనంద్ భవన్: జవహర్‌లాల్ నెహ్రూకు చెందిన చారిత్రాత్మక ‘ఆనంద్ భవన్’ ఎక్కడ ఉంది?

భారతదేశపు తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నివాసమైన ఆనంద్ భవన్ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) నగరంలో ఉంది.

రెక్కలు లేని పక్షి.. కళ్లు లేని ఏడుపు: రెక్కలు లేకుండా ఆకాశంలో ఎగురుతూ, కళ్లు లేకుండానే కన్నీరు కార్చేది ఏది?

దీనికి సమాధానం ‘మేఘం’. గాలి సహాయంతో మేఘాలు ఆకాశంలో ఒక చోటు నుండి మరోచోటుకు ప్రయాణిస్తాయి. భూమిపై వర్షంగా కురిసే నీటిని ఇక్కడ కన్నీటితో పోల్చారు.

తవ్వేకొద్దీ పెరిగేది: దేన్ని ఎంత ఎక్కువగా కత్తిరిస్తే (తవ్వితే) అంత పెద్దగా పెరుగుతుంది?

దీనికి సమాధానం ‘గోతి’ లేదా ‘కాలువ’. మనం భూమిని ఎంత ఎక్కువగా తవ్వుతామో, ఆ గుంత అంత పెద్దదిగా మారుతుంది.

Follow Us