
సముద్ర ప్రపంచం ఎంతో అందంగా ఉంటుంది..అంతేవిధంగా ఎన్నో రహస్యాలను తన కడుపులో దాచుకుని ఉంటుంది. కానీ, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం సముద్ర జీవులను గౌరవించాలి. వాటితో ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎందుకంటే.. సముద్రంలో ఉండే ఇసుక పులి షార్క్ అనేది ఓ వింత, భయంకరమైన జీవి..ఆడ ఇసుక పులి షార్క్ (Sand tiger shark embryos)ఒకేసారి అనేక గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు తల్లి షార్క్ శరీరం లోపల అభివృద్ధి చెందుతాయి. పిల్లలు గర్భంలో అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. కానీ, అక్కడ వాటి జీవితం అంత సులభం కాదు.. పిల్లలు పెరిగేకొద్దీ వాటి మనుగడ కోసం యుద్ధం ప్రారంభమవుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం.. దీనిని గర్భాశయ నరమాంస భక్షణ అని పిలుస్తారు. దీని అర్థం బలమైన పిల్లలు బలహీనమైన పిల్లలను తింటాయి. ఈ విధంగా, బలమైన సంతానం మాత్రమే మనుగడ సాగిస్తుంది.
కథ అక్కడితో ముగియలేదు. పుట్టకముందే షార్క్ పిల్ల తన తల్లి శరీరం నుండి కూడా పచ్చసొన, కొన్ని పోషకాలను తీసుకుంటుంది. అంటే అది తన తల్లి శరీరంలోని కొంత భాగాన్ని ఉపయోగించుకుంటుంది. అది పుట్టే సమయానికి, శిశువు పూర్తిగా అభివృద్ధి చెంది జీవించడానికి సిద్ధంగా ఉంటుంది.
ఇది క్రూరంగా అనిపించవచ్చు.. కానీ, ఇది ప్రకృతి నిర్మించిన కఠినమైన నియమం. సముద్రపు లోతుల్లో జీవితం ప్రమాదకరమైనది. కఠినమైనది. బలమైనవి మాత్రమే మనుగడ సాగిస్తాయనే ప్రకృతి నియమం ఇది. అందుకే ఇసుక పులి షార్క్ పుట్టకముందే పోరాటం, మనుగడ నైపుణ్యాలను నేర్చుకుంటుంది. అందుకే పుట్టిన తర్వాత కూడా ఇది సముద్రంలో అత్యంత శక్తివంతమైన, భయంకరమైన జంతువులలో ఒకటిగా పిలుస్తారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..