Viral Photo: ఈ ఫోటోలో మొదటిగా చూసేది ఇతరులు మీ గురించి ఏం అనుకుంటున్నారో చెప్పేస్తది.. 

ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) చిత్రాలు ఎప్పుడూ నెటిజన్లకు సవాల్ విసురుతాయి. అందులో ఏముందో కనిపెట్టేందుకు వాళ్లు తెగ ప్రయత్నిస్తారు.

Viral Photo: ఈ ఫోటోలో మొదటిగా చూసేది ఇతరులు మీ గురించి ఏం అనుకుంటున్నారో చెప్పేస్తది.. 
Optical Illusion

Updated on: Jun 09, 2022 | 6:07 PM

ఆప్టికల్ ఇల్యూషన్.. ప్రస్తుతం ఇవే సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్. ఇలాంటి ఫోటోలు మన కళ్లను మోసం చేయడమే కాదు.. మనస్సును కూడా ఓ ఆట ఆడేసుకుంటాయి. సామాజిక మాధ్యమాల్లో రకరకాల ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని అబ్బురపరుస్తాయి. అలాంటి వాటినే ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) చిత్రాలని అంటారు. ఇవి ఎప్పుడూ నెటిజన్లకు సవాల్ విసురుతాయి. అందులో ఏముందో కనిపెట్టేందుకు వాళ్లు తెగ ప్రయత్నిస్తారు. ఇదిలా ఉంటే.. సైకాలజిస్టులు.. తమ దగ్గరకు వచ్చే వ్యక్తుల మానసిక స్థితిని తెలుసుకునేందుకు ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను ఉపయోగిస్తుంటారు. ఇంటర్నెట్‌లో ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్స్‌ కోకొల్లలు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.!

ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది లాస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. ఇతరుల మీలో మొదటిగా ఏం చూస్తారో.. అదే వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. నమ్మలేకపోతున్నారా.? కావాలంటే.. మీరు ఒక్కసారి మీ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. ఇక ఈ ఆప్టికల్ ఇల్యూషన్ అదే వివరిస్తుంది. ఇతరులు మిమ్మల్ని ఫస్ట్ ఇంప్రెషన్‌లో ఏమనుకున్నారో చెప్పేస్తది. ముందుగా ఆ ఫోటోలో మీరేం చూశారు.. ఫస్ట్ 5 సెకన్లలో ఏం గమనించగలిగారు..

మొదటిగా మీరు పులి ముఖాన్ని చూసినట్లయితే..

ఇతరులు మీలో మొదటిగా గమనించేది మీ విశ్వాసం, దృఢ సంకల్పం. మీరు ఏ విషయంలోనైనా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారని నమ్ముతారు. ఇదే మీలో ఇతరులు చూసే బెస్ట్ క్వాలిటీ. అయితే కొన్నిసార్లు ఆ వ్యక్తిత్వ లక్షణమే.. ఇతరులను భయపెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

ఒకవేళ మీరు మొదటిగా చెట్లను చూసినట్లయితే:

ఇతరులు మీలో మొదటిగా గమనించేది మీ శాంతి గుణం.. అలాగే మీ జీవితంలో మీరు సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తారని అర్థం. ఇప్పటికే మీ లక్ష్యాలను చేరుకున్నారు. ప్రతీ పనిని చాలా సైలెంట్‌గా చేయాలనుకుంటారు. అదే ఇతరులను మీ వైపుకు ఆకర్షించేలా చేస్తుంది.