Optical Illusions: ఈ ఫోటోలో ముందుగా ఏం కనిపిస్తోంది.. దానిబట్టి మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారో అర్థం అవుతోంది..

|

May 03, 2022 | 3:21 PM

Optical Illusions: ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఇప్పుడు ఒక ట్రెండ్‌. మనం ఒక వస్తువును ఏ విధంగా చూస్తామన్న దాని బట్టి మన మానసిక ఆలోచనలను అంచనా వేయొచ్చని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఆప్టికల్‌ ఇల్యూజన్‌...

Optical Illusions: ఈ ఫోటోలో ముందుగా ఏం కనిపిస్తోంది.. దానిబట్టి మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారో అర్థం అవుతోంది..
Optical Illusions
Follow us on

Optical Illusions: ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఇప్పుడు ఒక ట్రెండ్‌. మనం ఒక వస్తువును ఏ విధంగా చూస్తామన్న దాని బట్టి మన మానసిక ఆలోచనలను అంచనా వేయొచ్చని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఆప్టికల్‌ ఇల్యూజన్‌ సిస్టమ్‌ ఆధారంగా ఒక వ్యక్తి ఆలోచనలు, బలాలు, బలహీనతలను ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారన్న విషయాన్ని కూడా అంచనా వేయొచ్చు. సోషల్‌ మీడియాలో విస్తృతి పెరిగినప్పటి నుంచి ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫోటోనే ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది.

పైన ఉన్న ఫోటోను చూడగానే మొదట రెండు చెట్లు, పూరి గుడిసెలు కనిపిస్తాయి. సహజంగా అందరికీ కనిపించేది ఇదే. కానీ తీక్షణంగా గమనిస్తే మాత్రం ఇందులో పిల్లి, ఏనుగు, కుక్క తల బొమ్మలు కూడా ఉన్నాయి. అయితే ఫోటోను గమనించగానే తొలుత మీకు ఒకవేళ రెండు పిల్లులు కనిపిస్తే మీరు ప్రేమకు అమితంగా విలువ ఇస్తారని అర్థం. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులతో బలమైన బంధం ఉందని అర్థం.

ఒకవేళ మీకు ముందుగా కుక్క తల కనిపిస్తే మీకు హెల్పింగ్ నేచర్‌ ఎక్కువ అని అర్థం. మీ స్నేహితులు తమ బాధలను చెప్పుకోవడానికి ఎల్లప్పుడూ మీ సహకారం కోరుతుంటారు. ఒకవేళ ఏనుగు కనిపిస్తే మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల విషయంలో విశ్వాసంతో ఉంటారని అర్థం. ఇతరుల అభిప్రాయలకు విలువ ఇస్తారు, ఇతరుల నుంచి కూడా గౌరవం లభిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి కె.జి.ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ స్పాట్ ఫోటోస్.. నెట్టింట వైరల్

Hyderabad: పెండింగ్‌ చలాన్లు చెల్లించలేదా.? బీకేర్‌ ఫుల్‌.. మీ ఇంటికి పోలీసులు వస్తుండొచ్చు..

Forbes List: అగ్రరాజ్యంలో సత్తా చాటిన జగిత్యాల వాసి.. ఏకంగా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు..