Viral Photo: ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోంది.? అదే మీ వ్యక్తిత్వం చెప్పేస్తుందోచ్!
పైకి కనిపించేది ఒకటి.. లోపల ఉన్నది మరొకటి.. అది ఫోటోగ్రాఫర్ మాయో.. లేక ఫోటోగ్రఫీ టెక్నికో.. ఎడిటింగో తెలియదు పలు చిత్రాలు...
పైకి కనిపించేది ఒకటి.. లోపల ఉన్నది మరొకటి.. అది ఫోటోగ్రాఫర్ మాయో.. లేక ఫోటోగ్రఫీ టెక్నికో.. ఎడిటింగో తెలియదు పలు చిత్రాలు మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇక ఇలాంటి వాటిని ‘ఆప్టికల్ ఇల్యూషన్’ చిత్రాలని అంటారు. ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలిగే ఈ చిత్రాలపై నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. వారి కంటికి కనిపించేది కాకుండా.. ఫోటోలో దాగున్న అసలైన రహస్యాలను కనిపెట్టేందుకు తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతున్నారు. మరి లేట్ ఎందుకు తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..
పైన పేర్కొన్న ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో రెండు జంతువులు ఉన్నాయి. అవేంటో మీరు చెప్పాలి. ఆ ఫోటోను చూస్తే మీకు మొదటిగా రెండు మొసళ్లు కనిపిస్తాయి. అయితే ఆ చిత్రాన్ని నిశితంగా చూస్తే ఓ పక్షి కూడా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో ముందుగా మీరేం చూస్తారో.? అది మీ వ్యక్తిత్వ లక్షణాన్ని అద్దం పడుతుంది.
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో మొదటిగా మీకు రెండు మొసళ్లు కనిపిస్తే.. మీరు ప్రతీ పరిస్థితిని అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారని అర్ధం. ఇతరుల ఆదేశాలను పాటించడం కంటే.. సిట్యువేషన్‌ను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుని బాధ్యతలు స్వీకరించడం మంచిది.
మీరు మొదటిగా పక్షిని గమనించినట్లయితే.. మీరు ఇతరుల సూచనలు, ఆదేశాలను అనుసరించడంలో అత్యంత సౌకర్యవంతంగా ఉంటారు. పైన ఫోటో ద్వారా తమ వ్యక్తిత్వ లక్షణాలను కనుగొనేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. మరి లేట్ ఎందుకు మీరూ ట్రై చేయండి. మీకేం కనిపిస్తోందో కామెంట్స్ రూపంలో చెప్పండి..
Which Animal You Are Seeing In This Optical Illusion#Trending #Viral @the_viralvideos @TheViralFever @itsgoneviraI @WhatsTrending @TrendingWeibo pic.twitter.com/UKim1hfCTq
— telugufunworld (@telugufunworld) April 16, 2022