ఆప్టికల్ ఇల్యూషన్.. ఇటీవల సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్న అద్భుతమైన చిత్రాలు. వీటిల్లో దాగున్న రహస్యాలను కనుగొనేందుకు నెటిజన్లు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తారు. ఇదిలా ఉంటే.. ఆప్టికల్ ఇల్యూషన్ లేదా పర్సనాలిటీ టెస్ట్ అనేది ఓ వ్యక్తి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్‌లు తరచూ వారి పేషెంట్స్ స్వభావాన్ని తెలుసుకునేందుకు ఈ టెస్టులను ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే క్యూబ్ పర్సనాలిటీ టెస్ట్.. ఆప్టికల్ ఇల్యూషన్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. వ్యక్తిత్వ లక్షణాలు, బలమైన కోరికలను తెలుసుకునేందుకు ఈ క్యూబ్ పర్సనాలిటీ టెస్ట్ బాగా ఉపయోగపడుతుంది. క్యూబ్ పర్సనాలిటీ టెస్ట్ అనేది మనోవిశ్లేషణకు ఒక ఉదాహరణ, ఇది మీ బలమైన కోరికలను తెరపైకి తీసుకురాగలదు. 90 సెకన్లలో మీ వ్యక్తిత్వానికి అనుగుణంగా మీ భవిష్యత్తు ఎలా రూపుదిద్దుకోగలదో చెప్పేస్తుంది. మరి అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
క్యూబ్ పర్సనాలిటీ టెస్ట్ అనేది వ్యక్తి ఉపచేతన మనస్సును లక్ష్యంగా చేసుకుంటుంది. అతడు ఏ దృక్కోణంలో ఆలోచిస్తున్నాడో.. మనసులో దాగున్న దహస్యం ఏంటో బయటపెడుతుంది. మనుషులు ఎక్కువ సమయం తమ సబ్‌కాన్షియస్ మైండ్‌పై ఆధారపడి ఉంటారని, దాని ఆధారంగానే తమ జీవిత నిర్ణయాలు తీసుకుంటారని అందరికీ తెలియదు. అందుకే ఆ నిగూఢమైన విషయాలను తెలుసుకోవడం ఎంతో అవసరం. క్యూబ్ పర్సనాలిటీ టెస్ట్‌ను జపనీస్ సైకాలజిస్ట్ అభివృద్ధి చేశాడు. ప్రజలు తమ జీవితాలను అంతర్దృష్టితో చూడగలరని.. వారి వ్యక్తిత్వాల గురించి మరింతగా తెలుసుకోవాలని కోరుకున్నాడు. మరి ఆ టెస్ట్ ఏంటంటే.!
ఇప్పుడు ఈ కింద ప్రశ్నలు, పరిస్థితుల గురించి ఆలోచించండి.? . పైన ఫోటోలో కనిపిస్తోన్న ఎడారి లేదా బహిరంగ ప్రదేశం ఎంత పెద్దదని ఆలోచిస్తున్నారు.? ఎడారి/బహిరంగ ప్రదేశం రంగు ఏమిటి? చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి.? అందులో మీరున్నారా.? ఉంటే మీరెక్కడ ఉన్నారు.?
క్యూబ్ ఎక్కడ ఉంది? అదెలా ఉంది? అది ఎంత పెద్దది? క్యూబ్ పారదర్శకంగా ఉందా లేదా రంగురంగులదా? ఆ క్యూబ్ కలరేంటి.? ఆ ఎడారి/బహిరంగ ప్రదేశంలో క్యూబ్ ఎక్కడుంది.? ఈ క్విజ్‌లో కరెక్ట్ లేదా తప్పుడు సమాధానాలంటూ ఏం లేవు. కాబట్టి మీరు వీలయినంత ఎక్కువగా ఊహించండి. వివరాలపై దృష్టి పెట్టండి.
నిచ్చెన ఎంత పెద్దది.? అది ఎలా కనిపిస్తోంది.? అదెలా తయారు చేయబడింది.? క్యూబ్‌తో పోల్చితే అదెక్కడ ఉంది.? ఆ నిచ్చెనను వీలైనంత వరకు వివరించడానికి ప్రయత్నించండి
ఆ ఎడారి/బహిరంగ ప్రదేశంలో గుర్రం ఉంది. దాని గురించి ఆలోచించండి. ఆ గుర్రం ఎలా ఉంటుంది? దాని రంగు ఏమిటి? అది క్యూబ్, నిచ్చెన నుంచి ఎంత దూరంలో ఉంది? మిమ్మల్ని మీరు నియంత్రించుకోకండి.. ప్రతీ విషయాన్ని ఊహత్మకంగా ఆలోచించండి.
ఇప్పుడు పువ్వుల గురించి ఆలోచించండి. అవి ఎక్కడ ఉన్నాయో ఊహించుకోండి. పువ్వుల రంగు ఏమిటి? అది ఒకటా.? లేక అనేకమా.? లేదా ఒక తోటా.? పువ్వుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? క్యూబ్, నిచ్చెన, గుర్రంతో పోలిస్తే పువ్వులు ఎక్కడ ఉన్నాయి?
తుఫాను ఎక్కడ ఉంది? ఇది మీకు సమీపంలో ఉందా లేదా దూరంగా ఉందా? తుఫాను ఎంత పెద్దది? ఆదెలాంటి తుఫాను? ఇది మీ ఊహలోని వస్తువులను ఎలా ప్రభావితం చేస్తుంది? లేదా అది దేనిపైనా ప్రభావం చూపించలేదా?
ఎడారి లేదా బహిరంగ ప్రదేశం అనేది ఇక్కడ మీ మనస్సును సూచిస్తుంది. దాని పరిమాణం మీరు ప్రపంచాన్ని చూసే విధానాన్ని, మీ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా మీ వ్యక్తిత్వం ఎంత పెద్దదో సూచిస్తుంది. మీరు ఊహించిన ఎడారి లేదా బహిరంగ ప్రదేశం పరిస్థితిని, ఇతరులు మొదటి మీటింగ్‌లో మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలియజేస్తుంది.
ఒకవేళ మీరు ఎడారి ఎండిపోయినట్లు, అక్కడ మరెవరూ లేకుండా మీరొక్కరే ఉన్నట్లు ఊహించుకుంటుంటే.. మీరు ప్రస్తుతం నిరాశావాది అని అర్ధం. ఒకవేళ ఆ ఎడారి లేదా బహిరంగ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉన్నట్లయితే.. మీరు ఆశావాది అని అర్ధం. ఆ ఎడారి లేదా బహిరంగ ప్రదేశం పచ్చగా ఉన్నట్లయితే.. మీరు చాలా కాల్యుకులేటివ్, విశ్లేషణాత్మకంగా ఉంటారని అర్థం.
క్యూబ్ మిమ్మల్ని సూచిస్తుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అలాగే మీ అహం ఎంత ఉంటుందో చెప్పేస్తుంది. కాబట్టి మీరు క్యూబ్‌ను పెద్దదిగా ఊహించినట్లయితే మీ అహం పెద్దదని అర్థం. ఒకవేళ చిన్నగా అనుకుంటే.. దానికి భిన్నమని అర్ధం. ఒక పెద్ద క్యూబ్.. మీరు మీ లక్ష్యాలు, కోరికల పట్ల ఖచ్చితంగా ఉంటారని చెబుతుంది. చాలా చిన్న క్యూబ్‌ను ఊహించిన వ్యక్తులు తమను తాము తక్కువని ఊహించుకుంటారు.
క్యూబ్ ఆకృతి- మృదువైన, ఎగుడుదిగుడు లేదా కఠినమైనది మీ స్వభావాన్ని సూచిస్తుంది. మృదువైన క్యూబ్ అంటే మీ స్వభావం చాలా మంచిది. మీరు మీ చుట్టూ ఉన్న ఇతరులను సౌకర్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. రఫ్ క్యూబ్.. మీ నిజాయితీని, ముక్కుసూటితనాన్ని సూచిస్తుంది. ఎగుడుదిగుడుగా ఉండే క్యూబ్.. మీరు ఇతరులను విమర్శించడంలో ఆనందాన్ని పొందుతారని చెబుతుంది. ఇతరులను తమను తాము తక్కువగా భావించేలా మీరు అనుకునేలా చేస్తారు.
ఎరుపు – మీరు శారీరకంగా చురుకుగా ఉంటారు
పసుపు- మీరు స్నేహశీలి
నీలం – మీరు తెలివైనవారు
వైలెట్ – మీరు తెలివైనవారు, పరిపూర్ణులు, మిస్టీరియస్
గ్రే – మీరు ఎలప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు, స్వతంత్రులు
నలుపు – మీరు బలమైన భావాలు కలిగి ఉంటారు. స్వత్రంత్రులు.
తెలుపు – మీరు దయగలవారు, స్వతంత్రులు, స్వావలంబన కలిగినవారు.
పారదర్శక క్యూబ్‌ని ఊహించినట్లయితే, మీరు ఓపెన్ మైండెడ్ అని అర్ధం.. మీ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని అనుకుంటారు. మెరుస్తున్న క్యూబ్ అయితే.. మీరు సానుకూల వ్యక్తి అని అర్ధం. మీ క్యూబ్ గ్రానైట్‌తో తయారు చేయబడితే మీరు చాలా ప్రొటెక్ట్‌వ్, స్థితిస్థాపకంగా ఉంటారని అర్థం. మీ క్యూబ్ నీరు లేదా మంచుతో తయారు చేయబడిందైతే.. బాహ్య అంశాలు మిమ్మల్ని, మీ జీవితాన్ని ప్రభావితం చేయడానికి మీరు అనుమతిస్తారని అర్ధం. ఇతరులు ఏమనుకుంటున్నారో దానిపై ఆధారపడి మీ నిర్ణయాలు ఉంటాయని అర్ధం. క్యూబ్ విత్ నథింగ్.. మీరు మీ ప్రాథమిక రూపాన్ని గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం.
మీకు, క్యూబ్‌కు మధ్య ఉన్న దూరం మిమ్మల్ని మీరు ఎంతగా అర్థం చేసుకున్నారో చూపిస్తుంది. దూరంగా ఉన్న క్యూబ్ అంటే మీరు మీ అంతరంగానికి దగ్గరగా లేరని అర్థం. క్యూబ్, ఎడారి నిష్పత్తి ఈ ప్రపంచంలో మీ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారో కూడా సూచిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లినా.. అందరి దృష్టి మీపై పడాలని కోరుకుంటున్నారని పెద్ద క్యూబ్ సూచిస్తుంది.
క్యూబ్ పర్సనాలిటీ టెస్ట్‌లోని నిచ్చెన మీ సంబంధాలు, స్నేహాలు, మీ లక్ష్యాల గురించి సూచిస్తుంది. ఒక పొడవైన నిచ్చెన మీ లక్ష్యాలు ఇంకా చాలా దూరంగా ఉన్నాయని చెబుతుంది. ఒక చిన్న నిచ్చెన మీ లక్ష్యాలను సాధించగలరని చూపిస్తుంది. నిచ్చెన క్యూబ్‌పై వాలినట్లయితే, మీ స్నేహితులు మీపై ఆధారపడి ఉన్నారని అర్థం. నిచ్చెన క్యూబ్ పక్కనే ఉంటే.. మీరు మీ స్నేహితులపై ఎక్కువగా ఆధారపడుతున్నారని అర్థం. క్యూబ్, నిచ్చెన మధ్య దూరం మీకు, మీ స్నేహితుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది. బలమైన నిచ్చెన అంటే మీది బలమైన బంధం అని, నిచ్చెన బలహీనమైనది అయితే.. దాని భిన్నం అని అర్ధం.
క్యూబ్‌లోని గుర్రం మీ ప్రేమికుడిని లేదా మీ ఆదర్శ ప్రేమికుడిని సూచిస్తుంది. మీరు గుర్రాన్ని ఎలా ఊహించుకున్నారు? అది ఆడుకుంటూ ఉంటే, మీ ఆదర్శ భాగస్వామి జీవితాన్ని చాలా సీరియస్‌గా తీసుకోలేదని అర్థం. గుర్రం నడుస్తున్నట్లయితే, మీ భాగస్వామికి సమయం అవసరమని అర్ధం. ఒకవేళ మీ గుర్రాన్ని కట్టి ఉన్నా, నిద్రపోతున్నా లేదా మేపుతున్నట్లయితే, మీ భాగస్వామి మీకు పూర్తిగా కట్టుబడి ఉన్నారని అర్థం. గుర్రం రంగు ఏమిటి? ఇది తెల్ల గుర్రం అయితే.? మీ బంధంలో అన్నింటికంటే మీరు విధేయత, నమ్మకానికి విలువ ఇస్తారని అర్థం. ఇది
బ్రౌన్ హార్స్ అయితే, మీరు మీ బంధంలో సౌకర్యం, విశ్వసనీయతను కోరుకుంటారు. నల్ల గుర్రం అయితే.. మీ భాగస్వామి ఆధిపత్యం చెలాయిస్తుందని, స్టైలిష్ అని అర్ధం. క్యూబ్‌కు ఎదురుగా గుర్రం ఉన్నట్లయితే.. మీరు మీ భాగస్వామి దృష్టిలో ఉండాలనుకుంటున్నారని సూచిస్తుంది. క్యూబ్‌కు దూరంగా గుర్రం ఉన్నట్లయితే.. మీరు స్పేస్ కావాలనుకుంటున్నారని అర్ధం. ఒకవేళ మీ గుర్రం నిచ్చెనకు దగ్గరగా ఉంటే, మీ కెరీర్‌కు ఎవరైనా మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నట్లు అర్థం.
తుఫాను అనేది మీ జీవితంలోని అడ్డంకులను సూచిస్తుంది. ఇది మీ జీవితంలో ఒత్తిడిని కూడా సూచిస్తుంది. తుఫాను బలంగా, క్యూబ్‌కు దగ్గరగా ఉన్నట్లయితే.. మీ జీవితంలో ఒత్తిడిని సూచిస్తున్నట్లు అర్ధం. తీవ్రమైన తుఫాను అంటే మీ సమస్యలు మీ జీవితాన్ని దుర్భరంగా మారుస్తున్నాయని అర్ధం. ఒకవేళ మీరు తుఫానులో మొత్తం ఎడారిని ఊహించినట్లయితే, మీరు ఇప్పటికే పలు సమస్యలను ఎదుర్కుంటున్నారని అర్ధం. వాటిని త్వరలో మీరు పరిష్కరించవచ్చు. తేలికపాటి తుఫాను అంటే మీ సమస్యలు త్వరలో తీరిపోతాయి.
మీరు ఊహించిన ఈ పువ్వులు మీ పిల్లలు, కుటుంబం, స్నేహితులకు చిహ్నంగా ఉంటాయి. పువ్వుల సంఖ్య పిల్లలు లేదా మీరు చుట్టూ ఉండాలనుకుంటున్న వ్యక్తులను సూచిస్తుంది. కొన్ని పువ్వులు మాత్రమే ఉన్నట్లయితే, మీరు మీ సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాత్రమే ఉండాలనుకుంటున్నారు. మీరు సింగిల్ చైల్డ్ చాలనుకుంటారని అర్ధం. చాలా పువ్వులు.. మీరు సామాజిక కార్యకర్త అని.. మీ చుట్టూ చాలా మంది వ్యక్తులు ఉండాలని కోరుకుంటారని అర్ధం. పువ్వు క్యూబ్‌కు ఎంత దగ్గరగా ఉంటే, మీరు మీ పిల్లలకు లేదా పిల్లలను కలిగి ఉండాలనే ఆలోచనకు దగ్గరగా ఉన్నట్లు అర్ధం. పువ్వులు మీ ఊహలో నిచ్చెనకు దగ్గరగా ఉన్నట్లయితే, మీరు పిల్లలను కలిగి ఉండాలని, మీ జీవితంలో అంతిమ లక్ష్యాలుగా వాళ్లను పెంచాలని కోరుకుంటున్నారని అర్థం. మరి లేట్ ఎందుకు మీరూ మీ పర్సనాలిటీ టెస్ట్‌ను ఒకసారి ప్రయత్నించండి.