Eye Test: బస్తీ మే సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న నంబర్స్‌ను ఎవరు కనిపెట్టగలరు..?

|

Jun 20, 2023 | 11:57 AM

Optical Illusion: మాస్టర్ గారూ వచ్చేశాం. మీ కోసం పదునైన పజిల్ తెచ్చేశాం. మీ ఐ పవర్ ఏ రేంజ్‌లో ఉందో ఈ పజిల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. సాల్వ్ చేసేద్దాం పదండి...

Eye Test: బస్తీ మే సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న నంబర్స్‌ను ఎవరు కనిపెట్టగలరు..?
Eye Test
Follow us on

ఈ మధ్య పజిల్స్ సోషల్ మీడియాలో బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. నెటిజన్లకు సవాల్ విసురుతున్నాయి. పజిల్ అంటే కేవలం పదాలకు సంబంధించినవి మాత్రమే కాదండోయ్. చాలా రకాలు ఉన్నాయ్.  ఈ చిత్రంలో నక్కిన జంతువును కనిపెట్టండి..? ఈ ఫోటోలో ఎన్ని జంతువులున్నాయి..? ఈ ఇమేజ్‌లో మీకు ఏయే నంబర్స్ కనిపిస్తున్నాయ్ ఇలా కోకొల్లలు. ఒక్కొక్కళ్లు ఒకో టైప్ పజిల్స్‌ను ఇష్టపడతారు. ఉదాహారణకు చెప్పాలంటే.. తెలుగుపై బాగా పట్టున్నవారు అనుకోండి. సుడోకు లాంటి పజిల్స్ ఇష్టపడతారు. ఇక తమ ఐ ఫోకస్ నెక్ట్స్ లెవల్ అనుకునేవారు… ఇందులోని వస్తువులు లేదా అంకెలు, జంతువులు కనిపెట్టండి అనే తరహా పజిల్స్ లైక్ చేస్తారు.

ఇప్పుడు మీకు సవాల్ విసరే ఓ పజిల్ తీసుకొచ్చాం. పైన ఉన్న ఫోటోను గమనించారా..? ఎరుపు, నలుపు చారలతో గుండ్రంగా ఉంది కదా..? అందులో కొన్ని నంబర్స్ ఉన్నాయి. అవి కనిపించి.. కనిపించనట్లుగా ఉన్నాయి. ఆ నంబర్స్‌ను కరెక్ట్‌గా చెప్పడమే మీకిచ్చే టాస్క్. తొలుత ఇదేంత.. నాకు సులువైన పనే అనిపిస్తుంది. కానీ సర్కిల్  జిగ్-జాగ్ కారణంగా కన్‌ప్యూజన్ ఏర్పడుతుంది. బహుశా మీరు మీ కళ్లను పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే “528” లేదా “4528”ని కూడా కనిపెట్టగరు. మిగతావి..?.  ఏంటి ఇంకా అక్కడ నంబర్స్ ఉన్నాయా అని నోరెళ్లబెట్టకండి. ఇక్కడే ఉంది అసలైన చిక్కు.

అక్కడ మొత్తం 7 సంఖ్యలు ఉన్నాయ్. అతి తక్కువ సమయంలో వాటిని కనిపెట్టినవారికి విజన్ పవర్ ఓ రేంజ్‌లో ఉందని ఒప్పుకోవాల్సిందే. సమాధానం కనుగొన్న వారందరికీ కంగ్రాట్స్. ఇక ఆన్సర్ మేమే చెప్పేస్తాం. జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఉన్న నంబర్స్.. 3452839. ఈ సారి ఇలాంటి పజిల్స్ ఇచ్చినప్పుడు మాత్రం బోల్తా పడకండి. కాస్త ఇస్మార్ట్ బుర్రతో ఆన్సర్ ఇచ్చేందుకు ట్రై చేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..